మహేష్ బాబు వెంకటేష్ హీరో లు గా వచ్చిన సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఈ సినిమా ఒక సంచలనం. స్టార్ హీరో లు మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి గానూ ఒకటికి వంద సార్లు ఆలోచన చేస్తున్న తరుణం లో ఈ ప్రాజెక్ట్ ని శ్రీకాంత్ అడ్డాలా దర్శకత్వంలో హీరోలు ఇద్దరూ ఓకే చేసి సినిమాను సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళారు. ఈ సినిమా ఓక సంచలనం సృష్టించింది. ఇక ఈ సినిమా వసూళ్లు కూడా ఒక రేంజ్ లో వచ్చాయి అప్పట్లో అనేది వాస్తవం. ఈ సినిమా కమర్షియల్ గా కూడా చాలా మంచి హిట్ అయింది అని చెప్పవచ్చు. 

 

ఇక ఈ సినిమా మహేష్ బాబు కి చాలా రోజుల తర్వాత మంచి హిట్ ఇవ్వగా వెంకటేష్ ని ఫాం లోకి తీసుకొచ్చింది అని అంటారు టాలీవుడ్ లో జనాలు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన అంజలి కూడా చాలా బాగా నటించింది. ఇక సమంతా నటన గురించి అందరికి తెలిసిందే. ఇక ఫ్యామిలీ ఆడియన్స్ ని ఈ సినిమా చాలా బాగా ఆకట్టుకుంది అని చెప్పవచ్చు. ఈ సినిమా కథ ఫ్యామిలీ ఆడియన్స్ కి చాలా బాగా దగ్గర అయింది అనేది వాస్తవం. కథ లో బలం ఉన్న నేపధ్యంలో ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాను బాగా ఆదరించారు అనేది వాస్తవం. 

 

ఇక ఈ ఇనిమా తర్వాత మల్టీ స్టారర్ సినిమాలకు డిమాండ్ వచ్చినా సరే హీరోలు మాత్రం ఆ సినిమాలను చేయడానికి ఎక్కువాగా ఆసక్తి అనేది చూపించలేదు అనే చెప్పాలి. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు కి వెంకటేష్ కి ఫ్యామిలీ ఆడియన్స్ లో క్రేజ్ కూడా చాలా బాగా పెరిగింది అనేది ఎవరూ కాదనలేని వాస్తవం అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: