టాలీవుడ్ లో చాలా తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది శ్రుతీ హాసన్. ఆమె సినిమాలు ఏ విధంగా ఉన్నా సరే ప్రేక్షకులు కచ్చితంగా ఆమెను ఆదరించారు అనేది వాస్తవం. ఇప్పుడు ఆమె టాలీవుడ్ లో ఒక్క సినిమా చేయడానికి కూడా చాలా కష్టపడే పరిస్థితి ఉంటుంది. గతంలో స్టార్ హీరోలతో సినిమాలు చేసిన ఆమె ఇప్పుడు ఒక స్టార్ హీరో సినిమా వచ్చినా చాలు అనుకునే పరిస్థితి ఉంది అనే చెప్పాలి. అగ్ర హీరోలతో అవకాశాలు ఆమెను అప్పట్లో వెతుక్కుంటూ వచ్చాయి. కాని ఇప్పుడు మాత్రం పరిస్థితి ఆ విధంగా దాదాపుగా లేదు అనే చెప్పాలి. 

 

దీనితో ఇప్పుడు ఆమెకు అవకాశాలు రాక ఆమె తీవ్ర ఒత్తిడి లో ఉంది అని అంటున్నారు టాలీవుడ్ జనాలు. ఇప్పుడు ఆమెకు ఛాన్స్ లు ఇవ్వడానికి స్టార్ హీరోలు ఎవరూ కూడా ఆసక్తి చూపించడం లేదు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఇక ఇప్పుడు ఆమెకు ఒక  మంచి ఛాన్స్ వచ్చింది అని అంటున్నారు. అయితే అది హీరోయిన్ గా చేసే ఛాన్స్ కాదు అని అంటున్నారు జనాలు. ఆమెకు ప్రస్తుతం పవన్ కాలిన ఛాన్స్ ఇవ్వడానికి ముందుకు వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ఆమెకు పవన్ కళ్యాణ్ తన సినిమాలో అవకాశం ఇచ్చాడు అని వార్తలు ఇప్పుడు టాలీవుడ్ లో సంచలనంగా మారాయి. 

 

ఇప్పుడు ఆమెను చెన్నై నుంచి హైదరాబాద్ రావాలి అని ఫోన్ కూడా వెళ్ళింది అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఆమె అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తుంది అని విషయం తెలుసుకుని ఆమెతో ఉన్న స్నేహం తో ఫోన్ చేసి పవన్ రావాలి అని చెప్పాడు అని అంటున్నారు. క్రిష్ తో సినిమాలో ఆమె హీరోయిన్ గా నటించడానికి పవన్ ఓకే చెప్పాడు అని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: