బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకోవడం యావత్ సినీ వర్గాలను కలచివేసింది. ఈ సమయంలో ఆత్మహత్య అంశంపై జాతీయస్థాయిలో పలు డిబేట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ మీడియాలో జరిగిన డిబేట్ లో ప్రభాస్ బుజ్జిగాడు సినిమాలో నటించిన కన్నడ భామ సంజన గార్లానీ కూడా పొల్గొంది. అయితే.. ఆత్మహత్య చేసుకోవడం తప్పు అని మాట్లాడుతూ లైవ్ లో ఆమె చేసిన పని ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారి తీసింది. నెట్టింట్లో ఆ వీడియో వైరల్ అవుతోంది.

IHG

 

ఓ జాతీయ చానెల్ లో సుశాంత్ ఆత్మహత్య పరిణామాలు.. ఆత్మహత్య అంశంపై డిబేట్ జరుగుతోంది. ఇందులో కొందరు సైకాలజిస్టులు, నిపుణులతో పాటు హీరోయిన్ సంజనా కూడా పాల్గొంది. అయితే డిబేట్ మధ్యలో ఉండగా సంజన తన మేకప్ కిట్ తీసుకుని మేకప్ సరిజేసుకుంటోంది. లైవ్ లో ఉన్న విషయం మర్చిపోయిందో.. కెమెరా తనవైపు లేదనే భ్రమలో ఉందో గానీ.. తను మేకప్ సరిజేసుకోవటం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. జరుగుతున్న డిబేట్ తీవ్ర ఆవేదనకు సంబంధించింది. ఆత్మహత్య తప్పు.. వద్దు అని ప్రేక్షకులకు అవగాహన పెంచే కార్యక్రమం. ఇలాంటి సమయంలో సంజన చేస్తున్న పని తగనిదే.

IHG

 

సుశాంత్ ఆత్మహత్య గురించి మాట్లాడుతూ మేకప్ సరిచేసుకోవటం ఏంటి అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సరదాగా వచ్చావా.. అంటూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి డిబేట్ లకు మేకప్ తో రావాల్సిన అవసరం లేదు.. వచ్చినా ఇలా లైవ్ లో మేకప్ అడ్జస్ట్ చేసుకోవడం.. పరిస్థితులపై నువ్వెంత సీరియస్ గా ఉన్నావో అర్ధమవుతోంది.. అంటూ నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. సుశాంత్ ఆత్మహత్యపై దేశవ్యాప్తంగా సినీ అభిమానులను కలచివేసింది. అభిమానుల నుంచి ప్రధాని వరకూ సుశాంత్ ఆత్మహత్యపై విచారం వ్యక్తం చేశారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: