సినిమాల్లో విలన్లు నిజ జీవితంలో మంచి వాళ్ళు. నూటికి తొంబై తొమ్మిది మంది చాలా దయగా ఉంటారు. అది వారి రీల్ లైఫ్ కి రియల్ లైఫ్ కి మధ్య తేడా. మరి సినిమాల్లో హీరోలుగా వేసిన వారంతా మంచివారేనా. అంటే ఇది కూడా అలాగే ఉండొచ్చు. రీల్ హీరోలు బయట విలన్లు కావచ్చు. ఇక సినిమా పరిశ్రమ‌లో మంచి చెడూ రెండూ ఉంటాయి. ఎందుకంటే సమాజంలో ఉన్న వారే అక్కడా ఉంటారు కాబట్టి.

IHG

ఇవన్నీ ఎందుకంటే బాలీవుడ్ యువ నటుడు రాజ్ పుట్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సుశాంత్ సింగ్ రాజ్ పుట్  అకాల మరణానికి కారణం ఏంటి అంటే అన్నీ అంటున్నారు. అందులో సినీ జనంలో కొంతమంది వివక్ష కూడా కారణమని చెబుతున్నారు. దీని మీద పొలిటీషియన్ సంజయ్ నిరుపం అంచనా, విశ్లేషణ ఒకలా ఉంది.  రియల్ లైఫ్ సినిమా క్రూయాలిటీ సుశాంత్ ని పొట్టనపెట్టుకుందని ఆయన అంటున్నారు.

IHG

ఇక మరో విషయం కూడా బాలీవుడ్ పెద్దలు చెబుతున్నారు. సుషాంత్ సినీ పరిశ్రమలో కొందరికి టార్గెట్ అయ్యాడని, ఆయన్ని పూర్తిగా ఒంటరిని చేశారని అంటునారు. కేవలం ఆరు నెలల వ్యవధిలో ఏడు సినిమాలు చేతికి వచ్చినట్లే జారిపోయాయని అంటున్నారు. వీటికి తోడు టార్గెట్ కావడం, మానసిక వేదన ఒత్తిడి అన్నీ కలసి సుశాంత్ లాంట్ యంగ్ టాలెంట్ ని లేకుండా చేశాయని చెబుతున్నారు.

IHG

ఈ విషయం విన్నపుడు మరో పోలిక ఇపుడు కచ్చితంగా గుర్తుకువస్తుంది. టాలీవుడ్ లో టాలెంటెడ్ హీరో ఉదయ్ కిరణ్  అప్పట్లో ఆత్మహత్య చేసుకున్నాడు, ఉదయ్ కిరణ్ కూడా సినిమా పిచ్చితో పాషన్ తో ఇక్కడికి వచ్చాడు. అతను పద్దెమిదేళ్లకే హీరో అయిపోయాడు. వరసగా బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ హిట్లు ఇచ్చాడు. అప్పట్లో టాప్ రేంజి హీరోలకు యంగ్ బ్లడ్ సత్తా చూపాడు.

IHG

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన ఉదయ్ కిరణ్ తక్కువ  టైంలో స్టార్ ఇమేజ్ దిశగా అడుగులు వేశాడు. ఆ తరువాత జరిగిన పరిణామాలతో ఉదయ్ కెరీర్ పూర్తిగా వెనక్కిపోయింది. వచ్చిన సినిమాలు కూడా చేజారాయి. సరిగ్గా సుశాంత్ లాగానే కేవలం 33 ఏళ్ల వయసులో ఉదయ్ కంప్లీట్ డిప్రెషన్ తో ఈ లోకాన్ని వీడి వెళ్ళిపోయారు. అంటే సినిమాను మించిన విలనీ ఏదో ఈ హీరోలను వెంటాడి కాటేసింది అనిపించకమానదు, వీరిద్దరే కాదు, ఎంతో మంది ఇలా ఉన్నారు. మరి వారందరూ ఇలా బాధితులే, విధి వంచితులే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: