టాలీవుడ్ లో ఇప్పుడు వెంకటేష్ కి మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. అగ్ర దర్శకులు యువ దర్శకులు అందరూ కూడా ఆయన తో మంచి సినిమాలను చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఆయన మాత్రం చాలా వరకు జాగ్రత్తగా మంచి కథలను ఓకే చేసి సినిమాలను చేసే పరిస్థితి అయితే టాలీవుడ్ లో ఉంది అని అంటున్నారు జనాలు. గతంలో ఉన్న క్రేజ్ కంటే ఇప్పుడు ఆయనకు ఇంకా ఎక్కువగా  క్రేజ్ ఉంది అనేది జనాల నుంచి వినపడుతున్న మాట. టాలీవుడ్ లో దాదాపుగా ఇదే వినపడుతుంది. 

 

ఆయనకు మంచి అవకాశాలు ఇవ్వడానికి అటు తమిళం లో కూడా రెడీ గా ఉన్నారు అని సమాచారం. ఆయన తో సినిమా చేయడానికి గానూ మురగదాస్ రెడీ అయ్యాడు అని అంటున్నారు. వెంకటేష్ కి ఇప్పటికే ఒక కథను వినిపించాడు అని అది పూర్తిగా తమిళం లో ఉంటుంది అని టాక్. మరి ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుంది అనేది చూడాలి. ఈ సినిమా తర్వాత టాలీవుడ్ లో ఆయనకు వచ్చే అవకాశాలు ఏ విధంగా ఉంటాయి అనేది చూడాలి. ఈ సినిమాలో ఆయన గుడ్డి వాడి గా నటించే అవకాశం ఉంది అని టాక్. 

 

దీనికి సంబంధించి త్వరలోనే ఒక స్పష్టత వస్తుంది అని ఇప్పటికే కథను విన్నారు అని కాని కొన్ని మార్పులు చేయడం దానిని తెలుగు కి తగిన విధంగా మార్చడం తో కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉంది అని సమాచారం. మరి ఇప్పుడు ఏ విధంగా ఈ సినిమా ముందుకు వెళ్తుంది అనేది చూడాలి.  ఆయన ఇప్పుడు నారప్ప అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. వచ్చే ఏడాది విడుదల చేయనుంది చిత్ర యూనిట్.

మరింత సమాచారం తెలుసుకోండి: