వీరిద్దరి జంటను చూసి తెలుగు చిత్ర పరిశ్రమ సైతం ఫిదా అయ్యింది. ఈ ఇద్దరూ కలిసి నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్సే. వీరిద్దరి కలయికతో సినిమా వస్తుందంటే ప్రేక్షకులకు పండగే. వీరి సినిమా వస్తుందంటే థియేటర్ కి వెళ్ళడానికి ముందు రోజు నుంచే రెడీగా ఉండే వాళ్ళు. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే పనులు పక్కన పెట్టి మరీ వీళ్ళ సినిమా చూసే వాళ్ళు. ఆ విధంగా టాలీవుడ్ లో ఈ జోడి చెరగని ముద్ర వేసింది ఈ జంట. సౌందర్య, వెంకటేష్ జోడీకి పరిశ్రమలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమలో క్లాసిక్ కాంబినేషన్స్ లో వెంకటేష్ - సౌందర్య జంట కూడా ఒక మంచి గుర్తింపు లభించిన జంట అని చెప్పుకోవచ్చు.

 

IHG

 

రాజా, పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం, జయం మనదేరా, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు వంటి సినిమాల్లో నటించి మెప్పించింది ఈ జోడి. దీనితో హిట్ పెయిర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ నేపధ్యంలో వీరి గురించి పెద్ద ఎత్తున వార్తలు వచ్చేవి. వీళ్ళు పెళ్లి కూడా చేసుకుంటారు అనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరిగింది. వీళ్ళ వివాహం గురించి పెద్ద చర్చలు జరిగాయి. చాలా మంది వీళ్ళు భార్యా భర్తలు కూడా అనుకున్నారు అప్పట్లో. అప్పటికే వెంకటేష్ కి పెళ్లి అయిపోయినా సరే భార్యకు విడాకులు ఇచ్చి చేసుకుంటాడు అనుకున్నారు.

 

IHG

 

వీరిద్దరి కాంబినేషన్ లో సూపర్ పోలీస్, పవిత్ర బంధం, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, పెళ్లి చేసుకుందాం రా..., రాజా, దేవిపుత్రుడు, జయం మనదేరా, పెద్ద రాయుడు ఇలా మంచి హిట్ సాధించుకున్న సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి అనే చెప్పాలి. ఇక " సూపర్ పోలీస్ " సినిమా వీరిద్దరి కాంబినేషన్ లో మొదటి సినిమా అవ్వడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: