ప్రేమకథల్లో ఆన్ స్క్రీన్ మ్యాజిక్ చేసే పెయిర్ మీద ఆడియన్స్ దృష్టి ఎక్కువగా ఉంటుంది. అలా తెలుగు సినిమాల్లో మ్యాజిక్ చేసిన అరుదైన కాంబినేషన్లలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్-భూమిక ఉన్నారని చెప్పాలి. 2001లో వచ్చిన ఖుషితో వారిద్దరి మధ్య కుదిరిన ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అద్భుతాలు చేసింది. లవ్ స్టోరీతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఘనత ‘ఖుషి’ పేరు మీదే ఉండిపోయింది. సినిమాలో పవన్ కల్యాణ్ చార్మింగ్ గ్రేస్, భూమిక అందం.. ధియేటర్లను కాలేజీలు, లవర్స్ పార్క్ లను చేసేసింది.

IHG

 

పవన్ ను భూమిక అపార్ధం చేసుకునే ప్రతిసారీ వీరిద్దరి మధ్య జరిగే సరదా సన్నివేశాలకు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. పవన్ నవ్వు, భూమిక చిలిపిదనం ప్రేక్షకుల్ని గిలిగింతలు పెట్టాయి. ఇక ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశం సినిమాకు హైలైట్. భూమిక నడుము చూస్తూ పవన్.. ఓరకంట కోపంగా చూసే భూమిక.. ఈ సన్నివేశం ఇప్పటికీ హాట్ ఫేవరేట్ గా నిలిచింది. సెకండాఫ్ లో వీరిద్దరి మధ్య అలకలు, కోపాలు ఎక్కువ. తండ్రి దగ్గర జరిగే సన్నివేశం.. మరో అమ్మాయితో పవన్ సరదాగా ఉంటే భూమిక అలక.. వంటి సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. యూత్ అంతా వీరిద్దరిలో తమను తాము చూసుకుని ఎంజాయ్ చేశారు.

IHG

 

కార్ రిపేర్ అని అబద్దం చెప్పి భూమికతో పవన్ నడుచుకుంటూ చేసే యాక్షన్.. వీరిద్దరూ థ్యాంక్స్ వద్దు అని చెప్పుకునే సీన్. సెకండాఫ్ లో వచ్చే హస్పిటల్ సీన్.. ఇలా ప్రతీ సన్నివేశం అద్భుతంగా వచ్చింది. ‘ప్రేమంటే సులువు కాదురా..’ పాటలో భూమిక స్పూన్ తీసుకుని పవన్ చేసే చిలిపి నటన.. భూమిక నవ్వు చెప్తుంది ఈ సినిమాకు వీరిద్దరూ ఎంత యాప్ట్ అయ్యారో. అందుకే ‘ఖుషి’ ఇప్పటికీ యూత్ కి హాట్ ఫేవరేట్ గా నిలిచిపోయింది

IHG

 

మరింత సమాచారం తెలుసుకోండి: