'ఇస్మార్ట్‌ శంకర్'‌ సినిమా విజయం తరువాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఫైటర్. విజయ్ దేవరకొండ హీరో గా వస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు నలభై శాతం వరకు పూర్తయినట్లు ఫిలిం నగర్ టాక్. తెలుగు, తమిళం మరియు హిందీ భాషలలో ఈ సినిమా తెరకెక్కుతోంది అని వార్తలు వస్తున్నాయి. మొట్టమొదటిసారి ప్యాన్ ఇండియా సినిమాలో విజయ్ దేవరకొండ నటిస్తున్నారు.  ఇదిలా ఉండగా ఇటీవల కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ అమలులో ఉండటంతో సినిమా షూటింగ్ ఆగిపోవడం జరిగింది. ప్రస్తుతం ప్రభుత్వాల నుండి సినిమా షూటింగులు చేసుకోవచ్చు అనే అనుమతులు రావటంతో... ఈ సినిమాకి సంబంధించిన అవుట్ డోర్ షూటింగ్ సన్నివేశాలు తీసేసినట్లు...అంతే కాకుండా విదేశాలలో తీయవలసిన ఫైట్ సన్నివేశాలు ఇక్కడే సెట్ లోనే తీయాలని పూరి జగన్నాథ్ మరియు విజయ్ దేవరకొండ డిసైడ్ అయినట్లు ఫిలిం నగర్ టాక్.

IHG

దీంతో సినిమాకి సంబంధించి కొద్దిగా స్క్రిప్ట్ చేంజ్ చెయ్యాలని పూరి మరియు విజయ్ దేవరకొండ తీసుకున్న నిర్ణయమని వార్తలు వస్తున్నాయి. దేశంలో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువ అవుతున్న తరుణంలో ఒక నెల గ్యాప్ ఇచ్చి...షూటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటే, ముందుగా సాంగ్స్ షూటింగ్ స్టార్ట్ చేయాలని పూరి అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

IHG

ఈ చిత్రంలో విజయ్‌ దేవరకొండకు జోడీగా బాలీవుడ్‌ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్‌ స్టార్‌ ఫిల్మ్‌ మేకర్‌ కరణ్‌ జోహార్‌ ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నాడు. పూరి, ఛార్మి, కరణ్‌ జోహార్‌లు నిర్మిస్తున్న ఈ చిత్రం మదర్‌ సెంటిమెంట్‌తో కూడిన కథాంశంతో సాగుతోందని యూనిట్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: