చిరంజీవి నేతృత్వంలో షూటింగ్ ల అనుమతుల కోసం అనేక రాయబారాలు చేసి షూటింగ్ లకు అనుమతులు పొందిన తరువాత చడీచప్పుడు లేకుండా టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ మారిపోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. వాస్తవానికి అనుమతులు వస్తే చాలు వెంటనే షూటింగ్ లకు రెడీ అంటూ అనేక లీకులు ఇచ్చిన టాప్ హీరోలు మిడిల్ రేంజ్ హీరోలు ఇప్పుడు ఒకేసారి మౌనముద్ర వహించి సైలెంట్ మూడ్ లోకి వెళ్ళిపోవడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.


ప్రస్థుతం భాగ్యనగరంలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోవడంతో పాటు ఇప్పటివరకు సిటీ చివరి ప్రాంతాలలో మాత్రమే పరిమితం అయిన కరోనా వైరస్ కేసులు సిటీ నడిఒడ్డు ప్రాంతాలలోకి కూడ వచ్చేసి ఎవరికీ ఎందుకు కరోనా సోకింది అన్న విషయంలో క్లారిటీ లేకపోవడంతో ప్రస్తుతం హైదరాబాద్ కరోనా కు హబ్ గా మారిపోవడంతో మన హీరోల ఆలోచనలు అన్నీ ఒకేసారి మారిపోయాయి అని అంటున్నారు. ముఖ్యంగా చిరంజీవి నాగార్జున బాలకృష్ణ వెంకటేష్ తమ వయసు రీత్యా కరోనా మహమ్మారి గురించి భయపడుతూ ఉంటే ఇళ్ళల్లో చిన్నపిల్లలు ఉన్న మహేష్ జూనియర్ అల్లు అర్జున్ నాని పవన్ కళ్యాణ్ లు తమ పిల్లల శ్రేయస్సు రీత్యా సినిమా షూటింగ్ లను ఆగష్టు పెట్టుకుందామని చెప్పినట్లు టాక్.


వాస్తవానికి ఈవిషయంలో కొంతవరకు సాహసం చేద్దామని చరణ్ ప్రభాస్ లు ఆలోచనలు చేసినా ఇంతమంది హీరోల అభిప్రాయాలతో వ్యతిరేకించలేక వారు కూడ మౌనం వహిస్తున్నట్లు సమాచారం. దీనితో భారీ మూవీ ప్రాజెట్లు ‘ఆర్ ఆర్ ఆర్’ ‘ఆచార్య’ ‘వకీల్ సాబ్’ ల షూటింగ్ లు ఇక ఈ నెలకు లేనట్లే అన్న ప్రచారం జరుగుతోంది.


ఇది ఇలా ఉండగా ‘మా’ సంస్థ అధ్యక్షుడు నరేశ్ ఒక ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ తనకు తెలిసినంతవరకు అనేకమంది కేరెక్టర్ ఆర్టిస్టులు హీరోలు హీరోయిన్స్ ఇప్పట్లో షూటింగ్ లకు రావడానికి ఆసక్తి కనపరచడం లేదు అన్న తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఒకసారి షూటింగ్ లు మొదలయ్యాక సామాజిక దూరం ప్రాటిస్తూ ఉదయానుండి సాయంత్రం వరకు మాస్ లు పెట్టుకుని అసహజమైన వాతావరణంలో లేని ఆనందాన్ని తెచ్చుకుని ఎలా నటించగలం అన్న అభిప్రాయం చాలామందికి ఉందని ఇలాంటి పరిస్థితులలో కొన్ని రోజులు వేచి చూడటమే మంచిది అంటూ నరేశ్ చెప్పిన అభిప్రాయాలను బట్టి ఇప్పట్లో షూటింగ్ లు మొదలుకావు అన్న విషయం ఎవరికైనా అర్ధం అవుతుంది..    

మరింత సమాచారం తెలుసుకోండి: