ఈ తరం ప్రేక్షకులను చాలా పద్దతిగా ఆకట్టుకున్న సినిమా పెళ్లి చూపులు. ఈ సినిమాలో హీరో హీరోయిన్ ల నటనకు చాలా మంచి మార్కులు పడ్డాయి అని చెప్పాలి. విజయ్ దేవరకొండ రీతు వర్మ ఈ సినిమాలో హీరో హీరోయిన్ గా నటించారు. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది అని చెప్పాలి. ముఖ్యంగా యూత్ కి ఈ సినిమా చాల బాగా నచ్చింది అని చెప్పాలి. యువత లో ఈ సినిమా అప్పుడు ఒక టెండ్ కూడా సృష్టించింది. ఈ సినిమాను చూసి చాల అమంది చాలా విధాలుగా పైకి వచ్చే దాని మీద ఆలోచనలు చేసి కొత్త ఆలోచనలతో దూసుకుపోయారు. 

 

ఇక ఈ సినిమాలో ఫుడ్ ట్రక్  అనే ఆలోచన సుపర్ హిట్ అని చెప్పాలి. సినిమాలో ప్రతీ సీన్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక హీరో హీరోయిన్ నటన విషయానికి వస్తే వీరు ఇద్దరూ కూడా ప్రేమలో కనపడకుండా ఒకరిని ఒకరు ప్రేమిస్తూ లాస్ట్ వరకు కూడా జనాలకు ఒక రేంజ్ లో సస్పెన్స్ ఇస్తారు అనేది స్పష్టంగా సినిమా చూడగానే అర్ధమవుతుంది. ఇక ఈ సినిమాలో వీరిని చూసిన యూత్ అయితే అలాంటి అమ్మాయి ఉంటే బాగుంటుంది అని అబ్బాయిలు. అలాంటి అబ్బాయి ఉంటే బాగుంటుంది అని అమ్మాయిలూ అనుకున్న సందర్భం కూడా ఉంది అని చెప్పాలి. 

 

వీరి లవ్ స్టోరీ కి సినిమాలో చాలా  మంచి మార్కులు వేసారు. దర్శకుడు కూడా వాళ్ళను చాలా అందంగా చూపించాడు. గది లో కూర్చుని మాట్లాడుకోవడం చివర్లో ప్రేమ ఒకరికి ఒకరు షేర్ చేసుకోవడం అన్నీ కూడా చాలా బాగా అప్పుడు యువతకు నచ్చాయి అని చెప్పాలి. ఈ సినిమా తర్వాత ఇద్దరి కెరీర్ లో వరుసగా సినిమాలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: