కరోనా కారణంగా థియేటర్లు మూతబడిపోవడంతో జనాలకి ఓటీటీ ఒక్కటే ఆధారమయ్యింది. వినోదం కోసం టీవీలు చూసే వాళ్లతో పోటీ పడి మరీ ఓటీటీలు సరికొత్త కంటెంట్ ని తీసుకువస్తూ ప్రేక్షకులని ఎంగేజ్ చేయడానికి చూస్తున్నారు. కరోనా ఉధృతి రోజు రోజుకీ పెరుగుతుండడంతో థియేటర్లు ఇప్పట్లో తెరుచుకునేలా లేవు. దాంతో చిన్న సినిమా నిర్మాతల నుండి పెద్ద సినిమా నిర్మాతల వరకూ అందరూ తమ సినిమాలని ఓటీటీలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.

 

ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎన్నో సినిమాలు ఓటీటీ ద్వారా విడుదల అయ్యాయి. అయితే కొన్ని చిత్రాలు మాత్రం ఓటీటీ ద్వారా విడుదల అయ్యే సమస్యే లేదని ఖరాకండిగా చెప్పేశాయి. అలా చెప్పిన వారిలో నిశ్శబ్దం సినిమా కూడా ఒకటి. అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం ఓటీటీ ద్వారా విడుదల అవుతుందంటూ వార్తలు వచ్చాయి. దాంతో నిర్మాత కోన వెంకట్ స్పందిస్తూ, మేం సినిమా తీసింది థియేటర్ కోసమే అంటూ.. నిశ్శబ్దం సినిమా థియేటర్లలోనే రిలీఝ్ అవుతుందని క్లారిటీగా చెప్పేశాడు.

 

అయితే రోజులు గడుస్తున్న కొద్దీ థియేటర్లు తెరుచుకుంటాయన్న ఆశ సన్నగిల్లుతోంది. లాక్డౌన్ సడలింపులు ఇచ్చినప్పటి నుండి కరోనా విజృంభణ మరింత పెరుగుతూనే ఉంది. గతంలో కంటే ఎన్నో రెట్ల కేసులు వెలుగుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో థియేటర్లు తెరుచుకుంటాయా అన్నది పెద్ద సంధిగ్ధం. అందువల్ల నిశ్శబ్దం చిత్రబృందం తమ నిర్ణయాన్ని పునరాలోచించుకునే పనిలో ఉందట.

IHG' teaser: <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=ANUSHKA SHETTY' target='_blank' title='anushka shetty-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>anushka shetty</a> unveils the teaser of her new ...

అదీ గాక ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలకి సరైన రెస్పాన్స్ రాకపోవడంతో ఓటీటీ యాజమాన్యాలు కూడా పెద్ద మొత్తంలో ఆఫర్ చేసే పరిస్థితి ఉండకపోవచ్చని భావిస్తున్నారట. అందువల్ల మరీ ఆలస్యం చేయకుండా తొందరగా డిసైడ్ అవ్వాలని అనుకుంటున్నారట. మరి ఈ విషయంలో తమ మాటకి కట్టుబడి ఉంటారా.. లేదా పరిస్థితులకి అనుగుణంగా తాము మారతారా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: