సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరణం ఎన్నో ప్రశ్నలని రేకెత్తించింది. వరుస బ్లాక్ బస్టర్లతో సూపర్ ఫామ్ లో ఉన్న హీరో ఇలా ఒక్కసారిగా సడెన్ గా ఆత్మహత్య చేసుకోవడం బాలీవుడ్ ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ లోని నెపోటిజంపై అనేక విమర్శలు వస్తున్నాయి. అయితే బాలీవుడ్ లోని బంధుప్రీతిపై చాలా మంది సెలెబ్రిటీలు తమ వ్యతిరేకతని తెలియజేస్తున్నారు.

 

ఆర్ ఎక్స్ 100 సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయమైన రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ ఈ విషయమై తన అనుభవాలని పంచుకుంది. తెలుగులో హీరోయిన్ గా పరిచయం కాకముందు హిందీ సీరియళ్లలో నటించిన పాయల్, అక్కడ సినిమాల్లోనూ ట్రై చేసింది. కానీ అక్కడ అవకాశాలు రాలేదు. ఆ తర్వాత అజయ్ భూపతి ఆర్ ఎక్స్ 100 లో అవకాశం ఇచ్చాడు. అయితే సుశాంత్ సింగ్ మరణం ఆమెని బాగా బాధపెట్టిందట.

 

హీరో సుశాంత్ సింగ్ ఫొటోను తన ఇంస్టాగ్రామ్ ప్రొఫైల్ ఫోటోగా పెట్టుకుని సుశాంత్ కు నివాళి అర్పించింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ లో తన అనుభవాలని పంచుకుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకానొక దశలో నన్ను కూడా దూరం పెట్టారు. నువ్వు హీరోయిన్ గా పనికిరావని ఎవరైనా అన్నప్పుడు గుండె పగిలిపోయేది. అలాంటి టైమ్ లో ఏం చేయాలో అర్థం అయ్యేది కాదు. వారన్న మాటలు నన్ను బాగా ఇబ్బంది పెట్టాయి ఎంతో కుంగిపోయాను కూడా. 

 

కానీ నేను ఆత్మహత్య చేసుకోవడం గురించి ఆలోచించలేదు. మనం అనారోగ్యంతో ఉన్నపుడు ఇతరుల సాయం తీసుకోవడం లేదా..? ఎప్పుడైనా సరే మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు మీ మనసు లోపల దాగిన కష్టాలను.. కలిగిన నష్టాలను.. మీలోని బలహీనతలు ఇతరులతో పంచుకోవాలని చెప్తుంది. మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనకి కావాల్సిన వాళ్లకి బాధలు చెప్పుకోవడం ద్వారా ఉపశమనం పొందవచ్చని, అదే మన బాధలకి సరైన మందు అని చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: