బాలీవుడ్ యువ కథానాయకుడు సుశాంత్ ఆత్మహత్యను ఇంకా చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్నో ఉన్నత ఆశయాలు ఉన్న సుశాంత్ ఇలా అకస్మాత్తుగా వెళ్లిపోవడం నమ్మలేకపోతున్నారు. ఈ సమయంలో ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు కొన్ని వెలుగులోకి వస్తున్నాయి. ఆయన త్వరలోనే పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారట.

 

 

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌, హీరోయిన్ రియా చక్రవర్తి ఇద్దరూ పెళ్లి చేసుకుందామని అనుకున్నట్టు ఓ ప్రాపర్టీ మేనేజర్ ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. పెళ్లి చేసుకున్నాక కలిసి ఉండేందుకు వారు ఓ ఇల్లు వెదికిపెట్టమని ఆ ప్రాపర్టీ మేనేజర్ ను కలిశారట. ఆయన మీడియాతో ఈ విషయాన్ని పంచుకున్నారు.

 

 

ఆ ప్రారర్టీ మేనేజర్ ఏం చెప్పారంటే.. “ సుశాంత్‌, రియా ఓ మంచి ఇంటి కోసం వెతుకుతున్నారు. బాంద్రాలో ఇంటి కోసం చూస్తున్నాం. నేను సుశాంత్‌తో కలిసి ఉండబోతున్నా. త్వరలో మా వివాహం జరగబోతోంది అని రియా నాతో చెప్పారు.. ఇంటి అద్దె చెల్లించడంలో సమస్యలు ఉన్నాయా? అని అడగగా.. అద్దె విషయంలో ఎప్పుడూ అలాంటివి జరగలేదు. అర్ధరాత్రి పార్టీలు జరుపుకోవడం మాత్రమే చిన్న సమస్యగా ఉండేది. ఓసారి సొసైటీ వారికి ఫిర్యాదు కూడా చేశారు అని ఆ ప్రాపర్టీ మేనేజర్ తెలిపారు.

 

 

ఇక సుశాంత్‌, రియాల విషయానికి వస్తే.. వీరు కొన్ని నెలలుగా ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో వీరి ఫొటోలు కూడా వైరల్‌ అయ్యాయి. సోషల్ మీడియాలోనూ వీరిద్దరూ తమ అనుబంధాన్ని బయటపెట్టేలా కామెంట్లు కూడా పెట్టుకున్నారు. కానీ ఇంతలోనే ఇలా సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడం అందరినీ షాక్ కు గురి చేసింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: