ఇప్పుడు టాలీవుడ్ లో రానా పెళ్లి ప్రకటన వచ్చిన తర్వాత యువ హీరోలకు సంబంధించి ఏదైనా వార్త వస్తే చాలు జనాలకు ఉండే ఆసక్తి అంతా ఇంతా కాదు. ఇప్పుడు రానా పెళ్లి తర్వాత జరిగేది నితిన్ పెళ్లి అని అంటున్నారు. నితిన్ ఇప్పటికే నిశ్చితార్ధం కూడా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక పెళ్లి చేసుకోవాల్సి ఉంది. అయితే లాక్ డౌన్ కారణంగా పెళ్లిని వాయిదా వేసారు. అసలే కరోనా కోరలు చిమ్ముకుంటూ విస్తరిస్తోంది. ఏదో తూతూ మంత్రంగా పెళ్లి చేసుకునేందుకు నితిన్ ఇప్పటి వరకు ఇష్టపడలేదు. అయితే ఇప్పట్లో కరోనా తగ్గేలా లేదు.
దీంతో నితిన్ ఎప్పుడు పెళ్లి చేసుకునే అవకాశం ఉంది అని చెప్పడానికి మాత్రం కాస్త కష్టంగానే ఉంది. అయితే వచ్చే నెలలో అతను పెళ్లి చేసుకునే అవకాశం ఉంది అని.... బెంగళూరు లో నితిన్ పెళ్లి చేసుకునే సూచనలు ఉన్నాయి అని టాలీవుడ్ లో జనాలు అంటున్నారు. అది ఎంత వరకు నిజం అనేది తెలియదు గాని ఈ పెళ్లి మాత్ర౦ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది అని చెప్పాలి.
ఈ పెళ్లి కోసం నితిన్ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నాడు అని అంటున్నారు. ఈ పెళ్లికి పవన్ కళ్యాణ్, ప్రభాస్ తో పాటుగా త్రివిక్రమ్, దర్శకుడు పరుశురాం, రష్మిక మంధన అదే విధంగా హారిక అండ్ హాసిని బ్యానర్ అధినేత రాధాకృష్ణ, రానా సురేష్ బాబు కి ఆహ్వానాలు ఇప్పటికే ఇచ్చారని సమాచారం. ఇక ఈ యేడాది భీష్మతో హిట్ కొట్టిన నితిన్ ఇప్పుడు మరో రెండు కొత్త సినిమాలకు కమిట్ అయ్యాడు.