మన తెలుగులో త్రివిక్రమ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమా విడుదల అవుతుంది అంటే పనులు మానుకుని చూసే జనాలు కూడా ఉన్నారు అని చెప్పాలి. ఇప్పుడు త్రివిక్రమ్ రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆయన ఒకటి నానీ తో చేస్తూ ఉండగా రెండోది ఎన్టీఆర్ తో చేస్తున్నాడు. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా వాయిదా పడే అవకాశం ఉన్న నేపధ్యంలో ఆయన గ్యాప్ లో నానీ తో సినిమా చేయడానికి గానూ రెడీ అయ్యాడు అని తెలుస్తుంది. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయడానికి గానూ సంక్రాంతికి విడుదల చేయడానికి గానూ చిత్ర యూనిట్ సిద్దమవుతుంది. 

 

ఇక ఇది పక్కన పెడితే టాలీవుడ్ లో  ఇప్పుడు ఆయన కోసం మరో  హీరో ఒత్తిడి తెస్తున్నాడు అని అంటున్నారు. ఆయనతో సినిమా చేయడానికి గానూ రామ్ చరణ్ రెడీ గా ఉన్నాడు అని ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఉన్నా సరే సినిమా చేస్తాను అని చెప్పాడు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి ఇప్పుడు. తనతో సినిమాకు సంబంధించి రామ్ చరణ్ ఇప్పటికే త్రివిక్రమ్ తో మాట్లాడినట్టు తెలుస్తుంది. నానీ తో సినిమాను వాయిదా వేసి తనతో సినిమా చెయ్యాలి అని తనకు డేట్స్ ఇవ్వడానికి ఏ ఇబ్బంది లేదు అని రామ్ చరణ్ చెప్పాడు అని టాక్. 

 

మరి ఈ సినిమాను త్రివిక్రమ్ చేస్తాడా లేదా అనేది చూడాలి. ఈ సినిమా విషయంలో ఆయన అంత ఆసక్తిగా లేడు అని టాలీవుడ్ జనాలు అంటున్నారు మరి. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో  మరి త్రివిక్రమ్ ఏ విధంగా సినిమా చేస్తాడు అనేది చూడాలి. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా ఈ ఏడాది అయ్యే అవకాశం లేదు కాబట్టి త్రివిక్రమ్ కి దాదాపుగా ఆరు నెలల వరకు గ్యాప్ దొరికే సూచనలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: