చిన్న చిన్న సినిమాల విషయంలో మన తెలుగులో ఏయే జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనే సంగతి తెలిసిందే. చిన్న చిన్న సినిమాల్లో ఉండే హీరోలు హీరోయిన్ ల విషయంలో బడ్జెట్ ని చాలా వరకు తక్కువగా ఉండే విధంగా చూసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మన తెలుగులో ఉన్న పరిస్థితి చూస్తే సినిమాలకు ఇక్కడ మంచి డిమాండ్ ఉంది. ఇక చిన్న చిన్న సినిమాలను అభిమానులు కచ్చితంగా ఆదరించే పరిస్థితి అయితే ఉంది అని చెప్పాలి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఒక వార్త టాలీవుడ్ లో సంచలనంగా మారింది. అది ఏంటీ అనేది చూస్తే.. 

 

చిన్న సినిమాలకు సంబంధించి ఇప్పుడు మార్కెట్ చాలా అవసరం. లేకపోతే చిన్న సినిమాలు బ్రతికే అవకాశాలు దాదాపుగా ఉండే అవకాశం ఉండవు అని చెప్పాలి. అందుకే ఇప్పుడు నిర్మాతలు దర్శకులు అందరూ కలిసి ఒక ప్లాన్ ని సిద్దం చేసారు అని తెలుస్తుంది. చిన్న చిన్న సినిమాల్లో స్టార్ హీరోలకు సంబంధించి ఒక్క 5 నిమిషాల పాత్ర అయినా ఉండే విధంగా చేస్తే మంచిది అని ఆ పాత్ర రెగ్యులర్ గా లేకుండా కాస్త కొత్తగా ఉండే విధంగా అయితే బాగుంటుంది అని ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మహేష్ బాబు  వంటి వారు చిన్న హీరోలతో ఎక్కువగా ఉంటున్న సంగతి తెలిసిందే. 

 

అందుకే మహేష్ బాబుని తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది అని నానీ తో సినిమా చేస్తున్న నిర్మాత ఒకరు ఆలోచించారు. అదే విధంగా కళ్యాణ్ రామ్ సినిమాలో ఎన్టీఆర్ ని అలాగే  శర్వా సినిమాలో రామ్ చరణ్ ని నిఖిల్ సినిమాలో పవన్ కళ్యాణ్ ని ఇప్పుడు తీసుకుంటే బెటర్ అనే ఆలోచనలో ఉన్నారు అని అంటున్నారు. వరుణ్ తేజ్ సినిమాలో చిరంజీవి కూడా కనపడే అవకాశం ఉంది అని అంటున్నారు మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: