ఎంతో కష్టపడి సినిమా తీస్తే తీరా రిలీజ్ ముందు కొంతమంది మనోభావాలు దెబ్బతినాయ్ అంటూ గొడవ చేసి సినిమా రిలీజ్ కు అడ్డుకుంటే. ఆ టైం లో అలా వచ్చిన వారితో చర్చలు జరపడం కొందరు చేస్తే అలాంటి వారిని లైట్ తీసుకుని రిలీజ్ చేసే వారు మరికొంతమంది. అయితే ముందు గొడవ చేసి చర్చల ద్వారా సర్ధుమనిగే వారు కొందరైతే కొందరు మాత్రం సీరియస్ గా తీసుకుని కోర్టుల దాకా లాగే వారు కొందరు.

 

ఇన్నాళ్లు సినిమాలకే అనుకున్న ఈ మనోభావాల సమస్య ఇప్పుడు ఓటిటి రిలీజ్ కు కూడా వచ్చింది. నవీన్ చంద్ర లీడ్ రోల్ లో చేస్తున్న సినిమా భానుమతి రామకృష్ణ. ఓటిటి రిలీజ్ కోసమే తీసిన ఈ సినిమా జూలై మొదటి వారంలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. అయితే అనుకోకుండా ఈ సినిమాకు భానుమతి ఫ్యామిలీ నుండి సమస్యలు ఎదురవుతున్నాయి. టైటిల్ లో భానుమతి ఉన్నందుకు సినిమాను రిలీజ్ ఆపాల్సిందే అంటూ వారు కోరుతున్నారు. అయితే సినిమా దర్శక నిర్మాతలు మాత్రం అందులో హీరోయిన్ పాత్ర పేరు భానుమతి అందుకే ఆ టైటిల్ పెట్టామని కించపరిచే సన్నివేశాలు లేవని చెబుతున్నారు.

 

సినిమా చూసిన తర్వాత వాళ్ల నిర్ణయం మారుతుందని.. అందుకే సినిమా చూడమంటున్నారట చిత్రయూనిట్. భానుమతి ఫ్యామిలీ మాత్రం సినిమా టైటిల్ లో భానుమతి పేరు తీసేయాల్సిందే అని చెబుతున్నారట. సినిమా రిలీజ్ ముందు ఇలాంటి గొడవలు సహజమే కాని ఓటిటిలో రిలీజ్ అవుతున్న సినిమాకు ఇలాంటి సమస్యలు రావడం చూస్తే ఆశ్చర్యమేస్తుంది. ఇంతకీ భానుమతి రామకృష్ణ సినిమా రిలీజ్ ఉంటుందా.. లేదా..? భానుమతి ఫ్యామిలీతో ఆ సినిమా దర్శక నిర్మాతలు సంధి కుదిరిందా లేదా అన్న విషయాలు తెలియాల్సి ఉంది.              

మరింత సమాచారం తెలుసుకోండి: