మూడు నెలల గ్యాప్ తర్వాత ఇప్పుడిప్పుడే సిని, టివి రంగాల్లో షూటింగ్స్ మొదలవుతున్నాయి. సినిమా షూటింగ్స్ కు లిమిటెడ్ పీపుల్ తో చేయడం కష్టమే కాని అందుకు తగినట్టుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంతకుముందు పనిచేసే వారి కన్నా అసిస్టెంట్ లే ఎక్కువమంది ఉండేవారు. ఇప్పుడు అందరికి కలిపి ఒకడే అసిస్టెంట్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక ప్రతి గురు, శుక్రవారం రాత్రి కాగానే జబర్దస్త్ చూసే బుల్లితెర ప్రేక్షకులు కూడా మళ్లీ జబర్దస్త్ వస్తుందని తెలుస్కుని సంతోషిస్తున్నారు.

 

ఇక ఈ కరోనా టైం లో చాలా విశేషాలే జరిగాయి. ఊహించని మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. మన దేశంలో ప్రస్తుతం రోజు రోజుకి కేసులు పెరుగుతున్నాయి. ఇదిలాఉంటే ఇలాంటి టైం లో కామెడీ స్కిట్స్ తో ప్రేక్షకులను నవ్వించడానికి వస్తున్నారు జబర్దస్త్ స్టార్స్. ఇక జబర్దస్త్ అనగానే గుర్తొచ్చే హైపర్ ఆది పంచులు కూడా బాగా మిస్సారు ప్రేక్షకులు. మరి ఇలాంటి టైం లో బయట జరిగే పరిస్థితులను తన స్కిట్ లో ప్రస్థావించి పంచులు వేసే ఆది ఎలాంటి స్కిట్స్ వేస్తాడో అన్న ఆసక్తి మొదలైంది.

 

అంతేకాదు ఈమధ్య ఇండస్ట్రీలో కూడా కొన్ని సంఘటనలు ఆసక్తికరంగా మారాయి. చిరంజీవిపై బాలకృష్ణ కామెంట్స్ హాట్ న్యూస్ గా మారాయి. మరి ఇలాంటి టైం లో తన పంచులతో హైపర్ ఆది ఎవరిని టార్గెట్ చేయబోతాడో చూడాలి. లేటెస్ట్ గా జబర్దస్త్ షూటింగ్ లో పాల్గొన్నట్టు సోషల్ మీడియాలో చెప్పిన అనసూయని చూసి అందరు హమ్మయ్య బయట పరిస్థితులు ఎలా ఉన్నా కొద్దిసేపు హాయిగా నవ్వుకోవచ్చు అనే మైండ్ సెట్ కు వచ్చేశారు.                                     

మరింత సమాచారం తెలుసుకోండి: