స్టార్ హీరో సూర్య సాలిడ్ హిట్ కొట్టి చాలా ఏళ్ళు  అవుతుంది. ఇటీవల అయన నటించిన సినిమాలు వరస పరాజయాలను చవిచూశాయి దాంతో తెలుగు మార్కెట్ దారుణంగా పడిపోయింది అయితే ఒక్క హిట్ పడితే  సూర్య కు పోయిన మార్కెట్ తిరగరావడం పెద్ద కష్టమేమి కాదు. ఇక సూర్య ఈసారి ఎలాగైనా  హిట్ కొట్టాలని ఓ నిజ జీవిత కథ తో సినిమా చేశాడు.. అదే  ఆకాశం నీ హద్దురా( సురరై పోట్రు). ఇటీవల సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. బోర్డు సభ్యులు ఈసినిమా కు క్లీన్ యూ సర్టిఫికేట్ ఇవ్వడంతో పాటు సినిమా బాగుందని ప్రశంసించారు దాంతో సూర్య అభిమానులు ఎప్పుడెప్పుడు ఈసినిమా విడుదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. థియేటర్లు తెరవాగానే ఈచిత్రాన్ని విడుదలచేయనున్నారు.
 
ఇదిలావుంటే ఈ సినిమా హిందీ హక్కుల కోసం భారీ పోటీ నెలకొందట. ఈ హక్కులను దక్కించుకోవడానికి నిర్మాతలు భారీ మొత్తాన్ని ఆఫర్ చేస్తున్నారట. మాములుగా హిందీలో రజినీ సినిమాలకు డిమాండ్  ఎక్కువ. ఇక ఇప్పుడు సూర్య సినిమా కు కూడా అంతే డిమాండ్ ఉండడం చూసి కోలీవుడ్ ఆశ్చర్యపోతుంది. హిందీలో ఈసినిమాను రీమేక్ చేస్తే షాహిద్ కపూర్ హీరోగా నటించే  అవకాశాలు ఎక్కువగా వున్నాయట. ఈ సినిమా పై షాహిద్ తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని టాక్. 
 
సూరరై పోట్రును శిక్య ఎంటెర్టైనెంట్స్ తో కలసి సూర్య సొంత బ్యానర్ 2డి ఎంటర్టైన్మెంట్స్ నిర్మించగా గురు ఫేమ్ సుధా కొంగర తెరకెక్కించింది. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జిఆర్ గోపినాథ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈచిత్రంలో అపర్ణ బాలమురళి హీరోయిన్ గా నటించగా  జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. ప్రముఖ తెలుగు నటుడు మోహన్ బాబు ఈ చిత్రంలో గెస్ట్ రోల్ లో కనిపించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: