మొదటి రెండు సినిమాలు సవ్యసాచి, మిస్టర్ మజ్ఞు లతో రాని క్రేజ్ నిధీ అగర్వాల్ కి ఇస్మార్ట్ శంకర్ తో వచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో ఇస్మార్ట్ బ్యూటి నిధీ అంటూ పిలుచుకుంటున్నారు. అయితే ఇంత బ్లాక్ బస్టర్ హిట్ అయినా కూడా నిధీ కి ఇప్పటి వరకు స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ దక్కలేదు. అయితే ప్రస్తుతం సూపర్ స్టార్ కృష్ణ మనవడు.. మహేష్ బాబు మేనళ్లుడు.. ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ సిల్వర్ స్క్రీన్ మీద ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. 'భలే మంచి రోజు' 'శమంతకమణి' 'దేవదాస్' సినిమాలతో టాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. 

 

ఈ సినిమాలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. అమరరాజా మీడియా అండ్ ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్ పై పద్మావతి గల్లా నిర్మిస్తున్నారు. ఇటీలవల గల్లా అశోక్ ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్ చేసాడు. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'యమలీల' సినిమాలోని సూపర్ హిట్ సాంగ్ 'జుంబారే జుమ్ జుంబారే' అనే పాటను అశోక్ గల్లా ఈ సినిమాలో రీమేక్ చేసాడు. ఈ పాటలో సూపర్ స్టార్ కృష్ణ ను అనుకరించి ఆకట్టుకున్నాడు. కృష్ణ సిగ్నేచర్ స్టెప్ అలాగే ఆయన హావభావాలు అశోక్ ఈ సాంగ్ లో చూపించాడు. 

 

అయితే ఈ పాటలో సెంటరాఫ్ అట్రాక్షన్ గా కనిపించింది మాత్రం నిధి అగర్వాల్. తన గ్లామర్ తో ఈ సినిమాకి మేయిన్ పిల్లర్ గా నిలవబోతుందని అంటున్నారు. అంటే ఈ సినిమాకి నిధీ అగర్వాల్ ఒక్కరే సక్సస్ ని తీసుకు వస్తుందని భావిస్తున్నారట. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ టాకీ పార్ట్ సగ భాగం కంప్లీటయిందట. జగపతి బాబు సీనియర్ నరేశ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం అందిస్తుండగా రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇక నిధి అగర్వాల్సినిమా తో పాటు మాస్ మహారాజా రవితేజ సరసన ఒక సినిమాలో నటించబోతుందని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: