గత ఏడాది ‘గద్దలకొండ గణేష్’ సినిమా తో అదిరిపోయే విజయాన్ని సాధించాడు డైరెక్టర్ హరీష్ శంకర్. త్వరలో పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి రెడీగా ఉన్నారు. గతంలో పవన్ కళ్యాణ్ తో ‘గబ్బర్ సింగ్’ సినిమా తో అదిరిపోయే విజయాన్ని మెగా అభిమానులకు హరీష్ ఇవ్వటం జరిగింది. ఇటువంటి తరుణంలో పవన్ తో నెక్స్ట్ చేయబోయే సినిమా ఎలా ఉంటుందో… ఏ టైపు లో పవన్ కళ్యాణ్ ని హరీష్ చూపించాలి అనుకుంటున్నాడో..? ఎలాంటి స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారో...? అనేక విషయాలపై చాలా ఉత్కంఠగా ఆసక్తిగా ఉన్నారు మెగా ఫ్యాన్స్.

IHG

ఇదిలా ఉండగా ఒక పక్క దర్శకత్వం చేస్తూనే మరో పక్క హరీష్ శంకర్ నిర్మాత గా మారనున్నట్లు వార్తలు వస్తున్నాయి. హరీష్ శంకర్ కి టాలీవుడ్ ఇండస్ట్రీలో గురువు గార్లుగా పేరొందిన రామ్ గోపాల్ వర్మ, పూరి జగన్నాథ్...లకి సొంతంగా బ్యానర్లు ఉండటం, ఇప్పుడు ఎక్కువుగా వారి బ్యానర్ లోనే ఎక్కువ సినిమాలు నిర్మిస్తున్నారు. ఇప్పుడు ఇదే తరహాలో హరీష్ శంకర్ తనకంటూ సెపరేట్ బ్యానర్ పెట్టాలని డిసైడ్ అయినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.

IHG't like what <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=RAM GOPAL VARMA' target='_blank' title='ram gopal varma-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ram gopal varma</a> did to <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=PAWAN' target='_blank' title='pawan-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>pawan</a> ...

అయితే ముందుగా డైరెక్టుగా సినిమాలు కాకుండా వెబ్ సిరీస్ లు తెరకెక్కించి.. ఇండస్ట్రీలో కొత్త కొత్త నటులను పరిచయం చేయాలని, కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేయడం కోసం హరీష్ శంకర్ ప్రొడ్యూసర్ గా మారాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముందుగా డైరెక్టర్ హరీష్ శంకర్ మరియు క్రిష్ కలసి సంయుక్తంగా ఓ వెబ్ సిరీస్ నిర్మాణానికి రెడీ అయినట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్.  

మరింత సమాచారం తెలుసుకోండి: