కొన్ని సినిమాలలో కొంత మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు పోషించే పాత్రలు చూస్తుంటే ఆ పాత్రలో వారిని తప్ప మరొకరిని ఊహించుకోలేము అనిపిస్తూ ఉంటుంది సినిమా చూస్తున్న ప్రేక్షకులకు . ఎందుకంటే క్యారెక్టర్ ఆర్టిస్టులు ఆ పాత్రలో ఒదిగిపోయి నటించిన తీరు ప్రేక్షకులను అంతలా  ప్రభావితం చేస్తూ ఉంటుంది. ప్రతి సినిమాలో హీరోలు హీరోయిన్లు ఎంత ముఖ్యమో సపోర్టింగ్ రోల్స్ లో నటించే క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే సపోర్టింగ్ రోల్స్ లో నటించే వారు అన్ని హావభావాలను పండించాల్సి ఉంటుంది. కొన్ని కొన్ని సినిమాల్లో అయితే క్యారెక్టర్ ఆర్టిస్టుల పాత్రలే సినిమాలో ఎంతో కీలకం గా మారుతూ ఉంటాయి. ఒక సినిమాకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్ర ఎంతో కీలకంగా మారుతుంది అనడానికి నిదర్శనం టెంపర్ సినిమా. 

 


 జూనియర్ ఎన్టీఆర్ హీరోగా టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం టెంపర్ . ఈ సినిమా అప్పట్లో ఎంత సెన్సేషన్ విజయాన్ని నమోదు చేసిందో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమా జూనియర్ ఎన్టీఆర్ లోని నటుణ్ణి బయటికి తెచ్చి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఇక తెలుగు ప్రేక్షకులందరికీ ఈ సినిమా ఆల్ టైం ఫేవరేట్ గా మారిపోయింది. అయితే ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా ఉన్న ఎన్టీఆర్ కింద పనిచేసే సిబ్బంది గా మూర్తి పాత్రలో నటిస్తాడు పోసాని కృష్ణ మురళి. 

 

 ఈ పాత్ర టెంపర్ సినిమాలో ఎంతో కీలకం గా మారిపోయింది అని చెప్పాలి. ఈ సినిమాలో ఎక్కువగా జూనియర్ ఎన్టీఆర్ krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి పాత్రల మధ్య ఎక్కువ సన్నివేశాలు ప్రేక్షకులకు ఫేవరెట్ గా మారిపోయాయి అని చెప్పాలి. ఎలాంటి పరిస్థితుల్లో కూడా అవినీతికి పాల్పడని పోసాని... ఎప్పుడు అవినీతికి పాల్పడే ఎన్టీఆర్... ఇద్దరి  పాత్రల మధ్య జరిగే సంభాషణలు తెలుగు ప్రేక్షకులందరికీ ఫిదా  చేశాయి. ఇక మూర్తి పాత్రలో krishna MURALI' target='_blank' title='పోసాని కృష్ణమురళి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పోసాని కృష్ణమురళి తన వైవిధ్యమైన నటనతో పాత్రకు ప్రాణం పోసి ఆయన తప్ప ఇంకెవరూ ఈ పాత్ర చేయలేరు అనెంతలా  తెలుగు ప్రేక్షకులను ప్రభావితం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: