మెగాస్టార్ చిరంజీవి...కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ లాక్ డౌన్ కారణంగా ఆగిపోవటం జరిగింది. ఇటీవల ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వటంతో త్వరలోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత.. చిరంజీవి...సుజీత్ దర్శకత్వంలో 'లూసీఫర్' రీమేక్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. సినిమాకి సంబంధించి రీమేక్ రైట్స్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దక్కించుకుని ఈ సినిమాని మొదట వివి వినాయక్ చేతిలో పెడదామని భావించినట్టు వార్తలు వచ్చాయి. కానీ రామ్ చరణ్ 'సాహో' సినిమా డైరెక్టర్ సుజిత్ పనితనం చూసి ఆయన చేతిలో పెట్టడం జరిగింది. ఈ విషయాన్ని రామ్ చరణ్ తండ్రి చిరంజీవి కి చెప్పిన టైం లో ఆయన వెంటనే ఒప్పుకోవటం జరిగిందట.

IHG

దానికి కారణం చూస్తే ‘సాహో’ సినిమా తీసిన విధానం హాలీవుడ్ స్థాయిలో   ఉండటంతో… పైగా ప్రస్తుత తరానికి కరెక్ట్ గా యాప్ట్ అయ్యేవిధంగా తీసిన విధానం చిరంజీవికి నచ్చడంతో వెంటనే ఒప్పుకున్నట్లు మెగా కాంపౌండ్ లో టాక్. మరోపక్క మలయాళంలో సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాల్‌ నటించిన ‘లూసీఫర్‌’ అక్కడ భారీ స్థాయిలో విజయం సాధించింది.

IHG's <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=TELUGU' target='_blank' title='telugu-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>telugu</a> ...

ఖచ్చితంగా ఈ సినిమా తెలుగువారికి నచ్చుతుందని, ముఖ్యంగా తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి కి బాగా సూట్ అయ్యే సబ్జెక్ట్ అనే ఉద్దేశంతో రామ్ చరణ్ రీమేక్ రైట్స్ దక్కించుకోవడం జరిగిందట. ప్రస్తుతం తెలుగు వారికి మరియు చిరంజీవికి సూట్ అయ్యే విధంగా స్క్రిప్ట్ వర్క్ లో డైరెక్టర్ సుజిత్ మార్పులు చేర్పులు చేస్తూ తలమునకలై ఉన్నాడు. చిరంజీవి సూచన మేరకు ఒరిజినల్‌ వర్షన్‌ లో చాలా మార్పులు చేర్పులు చేసినట్లుగా తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: