మెగాస్టార్ చిరంజీవి సినిమాలో మొత్తం చిరంజీవే కనిపిస్తాడు.. కనిపించాలి. ఇదీ మెగాస్టార్ గా చిరంజీవి ప్రభ వెలిగిపోతున్న ఎనభై.. తొంభై దశకాల్లో అభిమానుల మాట. అంతగా సినిమాల్లో చిరంజీవి ఇంపాక్ట్ ఉండేది. అటువంటి సమయంలో చిరంజీవితో కాకుండా ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్ర ఆయన సినిమాలో హైలైట్ అవుతుందని ఎవరూ అనుకోరు. కానీ.. దానిని సాధ్యం చేసి చూపించాడు విలక్షణ నటుడు మోహన్ బాబు. ‘కొదమసింహం’ సినిమాలో ‘సుడిగాలి’ పాత్రలో మోహన్ బాబు నటన, పాత్ర, మేకోవర్, హవభావాలు, డైలాగ్ డిక్షన్.. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్ అని చెప్పాలి.

IHG

 

మోహన్ బాబు ఆ పాత్రలో అంతగా లీనమైపోయి నటించాడు. మోహన్ బాబుకు డైలాగ్ కింగ్ అని పేరు. ఈ సినిమాలో తన మార్క్ డైలాగులతో ఆ పేరు నిలబెట్టుకున్నాడు. కథ అంతా సీరియస్ గా నడిచే సమయంలో మోహన్ బాబు కామెడీ విలన్ పాత్ర సినిమాకి ప్రాణం పోస్తుంది. బార్ లో ఫుడ్, డ్రింక్ ఆర్డరిచ్చే సమయంలో ఆయన యాక్షన్, డైలాగ్స్ ప్రేక్షకుల్ని గిలిగింతలు పెట్టిస్తాయి. నిజానికి ఈ పాత్రను సినిమా మధ్యలోనే చంపేయాలని మొదట స్క్రిప్టు దశలో రాసుకున్నారట. కానీ.. పరుచూరి సోదరులు ఈ పాత్ర సినిమా చివరి వరకూ ఉంటూ పాత్ర పండుతుంది.. సినిమాకు ప్లస్ అవుతుందని మార్చారట.

IHG'సుడిగాలి'ని బతికించారు ...

 

అనుకున్నట్టే సుడిగాలి పాత్ర కొదమసింహం హిట్ లో కీలకపాత్ర పోషించింది. సినిమాలో సుడిగాలి పాత్ర కనిపించిన ప్రతి సందర్భంలో మోహన్ బాబు తనదైన డైలాగ డిక్షన్ తో నవ్విస్తారు. క్లైమాక్స్ లో జైల్లో ఆయన చెప్పే డైలాగ్ కూడా సుడిగాలి పాత్ర సినిమాకు ఎంత కీలకమో నిరూపిస్తుంది. సుడిగాలి పాత్ర చిరంజీవితో పాటు సరిసమానమైనదని చెప్పాలి. మోహన్ బాబు కెరీర్లో ఆయన పోషించిన అద్భుతమైన పాత్రల్లో ‘సుడిగాలి’ ఒకటి.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: