బాహుబలితో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది సీనియర్ నటి రమ్యకృష్ణ. ఈ సినిమా రమ్యకృష్ణ కు మళ్ళీ భారీగా అవకాశాలను తెచ్చిపెట్టింది. ఇక ప్రస్తుతం తెలుగులో పలు సినిమాలతో బిజీగా వుంది. అందులో విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఫైటర్ (వర్కింగ్ టైటిల్)కూడా ఒకటి. ఈచిత్రంలో రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తుంది. తాజాగా ఆమె ఈసినిమా గురించి స్పందించింది. ఫైటర్ సాలిడ్ స్టోరీ తో తెరకెక్కుతుంది. డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమాను బాగా డీల్ చేస్తున్నాడు. విజయ్ దేవరకొండ, నాకు మధ్య ఎమోషనల్ సన్నివేశాలు బాగా వచ్చాయి...ఈసినిమా మరో బాహుబలి అవుతుందని రమ్యకృష్ణ వెల్లడించింది. 
 
ఇక ఇప్పటివరకు ఈసినిమా షూటింగ్  40శాతం పూర్తి కాగా ప్రస్తుతం కరోనా వల్ల బ్రేక్ పడింది అయితే ఇప్పట్లో  మళ్ళీ షూటింగ్ స్టార్ట్ అయ్యేలా కనిపించడం లేదు. విదేశాల్లో కూడా పలు షెడ్యూల్ లను ప్లాన్ చేశారు. కానీ కరోనా దెబ్బకు ఆషెడ్యూల్ లను మొత్తానికే రద్దు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈచిత్రంతో విజయ్, బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో తెలుగుతో పాటు హిందీలోనూ తెరకెక్కుతున్న ఈచిత్రంలో విజయ్ సిక్స్ ప్యాక్ లో కనిపించనుండగా స్టూడెంట్ అఫ్ ది ఇయర్ 2 ఫేమ్ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. తెలుగులో ఆమెకు ఇదే మొదటిసినిమా.
 
అపూర్వ మెహతా ,కరణ్ జోహార్ లతో కలిసి ఛార్మి ,పూరి కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈసినిమా థియేటర్లలోకి వచ్చేలా వుంది. ఇక డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ తో భారీ డిజాస్టర్ లను చవిచూసిన విజయ్, ఫైటర్ పై భారీ ఆశలు పెట్టుకున్నాడు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: