ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది సపోర్టింగ్ ఆర్టిస్టులు ఉన్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఈ క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరో హీరోయిన్లకు తల్లిదండ్రుల పాత్రల్లో నటించడంతో పాటు ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో కూడా నటిస్తూ తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్నారు. కొన్ని సినిమాల్లో అయితే హీరోలను మించిన హావభావాలను పండిస్తూ.. తమ నటనతో అందరినీ ఫిదా  చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో ఎలాంటి పాత్రలో అయిన పరకాయ ప్రవేశం చేసి నటించి వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్గా మారిన నటుల్లో ఒకరు రాజేంద్ర ప్రసాద్. ఒకప్పుడు హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాల్లో నటించిన రాజేంద్ర ప్రసాద్ అప్పట్లోనే కమెడియన్ గా కూడా  తెలుగు ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించాడు. 

 


 ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడా వెనక్కి తిరిగి చూసుకోలేదు రాజేంద్రప్రసాద్. హీరో హీరోయిన్ల తల్లిదండ్రులు... లేదా సినిమాల్లో ముఖ్య పాత్రలు.. కమెడియన్ పాత్రలు ఇలా చెప్పుకుంటూ పోతే రాజేంద్రప్రసాద్ చేసిన పాత్రల  లిస్టు చాలానే ఉంది అని చెప్పాలి. పాత్ర ఎలాంటిదైనా తన నటనతో మాత్రం అందరినీ మెప్పిస్తూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. అయితే మహానటి సినిమాలో రాజేంద్రప్రసాద్ పోషించిన పాత్ర మాత్రం తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది అని చెప్పాలి. అలనాటి గొప్ప నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం మహానటి. 

 

 ఈ సినిమాలో సావిత్రి పాత్రలో  కీర్తి సురేష్ నటించగా  సావిత్రి పెదనాన్న పాత్రలో రాజేంద్రప్రసాద్ నటిస్తాడు. ఇక సావిత్రికి చిన్నప్పుడే తండ్రి దూరమవడంతో పెద్ద నాన్నే  నాన్న గా మారిపోయి సావిత్రి ఆలనా పాలనా చూసుకుంటూ ఉంటాడు. ఒక రకంగా చెప్పాలంటే సావిత్రి తండ్రే  సావిత్రి సినిమాల్లోకి రావడానికి కారణం అని చెప్పవచ్చు. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ ఎంత ఒదిగిపోయి నటించిందో సావిత్రి తండ్రి పాత్రలో రాజేంద్ర ప్రసాద్ అంతే ఒదిగిపోయి  నటించారు అని చెప్పాలి. తన కూతురుని హీరోయిన్గా చేయడానికి రాజేంద్రప్రసాద్ పడే కష్టాలు... ఆ పాత్రలోని హావ భావాలు అన్నింటిలో రాజేంద్రప్రసాద్ పరకాయ ప్రవేశం చేశారు అని చెప్పాలి. అందుకే ఈ పాత్ర తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: