టాలీవుడ్ లో చాలా తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది రష్మిక మంధన. ఆమె చాలా మంచి పేరు తెచ్చుకుని డాన్స్ లో అయినా నటనలో అయినా సరే దూసుకుపోతుంది ఇప్పుడు అని చెప్పవచ్చు. అగ్ర హీరోల సినిమాల్లో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది అని చెప్పాలి. స్టార్ హీరోలు కూడా ఆమెకు అవకాశాలు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా పాప కోసం ఎదురు చూసే పరిస్థితి మన తెలుగులో ఉంది అనేది వాస్తవం. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఆమె గురించి ఒక వార్త టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. 

 

పాప ఈ మధ్య కథలను వింటుంది. యువ రచయితలను మెయిల్ చేయమని చెప్పింది ఆమె. దీనితో యువ రచయితలు కొందరు ఆమెకు కథలను మెయిల్ చేసారు. ఆ కథలను విని ఆమె సినిమాలను నిర్మించాలి అని భావిస్తున్నారు. చిన్న చిన్న సినిమాలను ఆమె నిర్మాతగా తీసుకుని వచ్చే ఆలోచనలో ఉన్నారు అనే ప్రచారం సోషల్ మీడియాలో ఎక్కువగా జరుగుతుంది. అగ్ర హీరోల సినిమాల్లో నటిస్తూనే చిన్న హీరోల సినిమాలకు నిర్మాతగా మారాలి అని ప్లాన్ చేస్తుంది ఆమె అని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.

 

ఇప్పుడు ఒక కథ విన్నదని ఆమె సినిమాను చేయడానికి కూడా హీరో ని సెలెక్ట్ చేసుకుంది అని అంటున్నారు. మరి ఎప్పుడు సినిమా చేస్తుంది అనేది చూడాలి. ఇప్పుడు ఆమె లాక్ డౌన్ లో చాలా వరకు ఖాళీ గానే ఉంది. దీనికి సంబంధించి ఆమె బడ్జెట్ ని రెడీ చేసుకుంది అని త్వరలోనే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళే ఆలోచనలో ఉంది అని అంటున్నారు. మరి ఈ సినిమాలో ఆమె కూడా నటిస్తుందా లేదా అనేది చూడాలి అంటే ఆగాలి కొన్ని రోజులు.

మరింత సమాచారం తెలుసుకోండి: