త్రివిక్రమ్ సినిమా అనగానే మాజీ హీరోయిన్ కి ఏ పాత్ర ఇస్తున్నాడు అనే ఆసక్తి జనాలకు ఎక్కువగా ఉంటుంది. మాజీ హీరోయిన్ కి ఇచ్చే పాత్ర ఎలా ఉంటుంది అంటూ జనాలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తారు.  పాత్ర ఎలా ఉన్నా సరే అది మాత్రం సినిమాలో కచ్చితంగా హైలెట్ అవుతుంది అనేది వాస్తవం. ప్రతీ చిన్న విషయాన్ని ఆ పాత్రకు సంబంధించి త్రివిక్ర౦ జాగ్రత్తలు తీసుకునే ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అనేది వాస్తవం. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు నానీ తో చేస్తునన్ సినిమాకు గానూ బాలీవుడ్ హీరోయిన్ ని తీసుకుని రావాలి అని చూస్తున్నాడు. 

 

నానీ కి అక్కగా విద్యా బాలన్ ని తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడు అని సమాచారం. ఆమె పాత్ర సినిమాలో చాలా హైలెట్ అవుతుంది అని సమాచారం. ఆమె తో ఇప్పటికే మాట్లాడినట్టు కూడా వార్తలు వస్తున్నాయి మరి. ఆమె చేస్తుందా లేదా అనేది తెలియదు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే చర్చలు అన్నీ కూడా పూర్తి అయ్యాయి అని హారిక అండ్ హాసిని బ్యానర్ లో ఈ సినిమాను చేసే అవకాశం ఉంది అని తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తో సినిమా చేయనున్నాడు త్రివిక్రమ్ అనే సంగతి తెలిసిందే. 

 

ఎన్టీఆర్ ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో బిజీ గా ఉన్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది అనేది చెప్పడం కాస్త కష్టమే అని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. చూడాలి మరి ఎం జరుగుతుందో... ఇక ఆర్ఆర్ఆర్ అయిన తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేస్తాడు. అది లేట్ అయ్యే అవకాశం ఉన్న నేపధ్యంలో త్రివిక్రమ్ నానీ తో సినిమాను  ప్లాన్ చేసాడు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి మరి. చూడాలి ఎప్పుడు వస్తుందో...

మరింత సమాచారం తెలుసుకోండి: