టాలీవుడ్ లో ఇప్పుడు మాజీ హీరోయిన్ లకు మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు స్టార్ హీరోలు గా ఒక వెలుగు వెలిగిన వారు ఇప్పుడు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు అనే చెప్పాలి. చిన్న చిన్న పాత్రలు వచ్చినా సరే చాలు అనుకునే పరిస్థితి ఉంది ఇక అగ్ర హీరోయిన్ లు గా ఉన్న వారు కూడా ఇప్పుడు చాలా వరకు మంచి సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్ర అయితే తమకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు అని చెప్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఒక విషయం చెప్పుకోవాలి.. 

 

టాలీవుడ్ లో ఇక మాజీ హీరోయిన్ లను వద్దు అనే ఆలోచనలో ఉన్నారని సమాచారం. ఎందుకు అంటే భారీగా పారితోషికం తగ్గించుకునే ఆలోచనలో ఉన్నారు అని అందుకే ఇప్పుడు వారిని పక్కన పెట్టడానికి రెడీ అయ్యారు అనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. ఇటీవల నదియా స్నేహా ను అసలు వద్దు అన్నారు అని సమాచారం. దానికి కారణం ఏంటీ అనేది తెలియదు గాని వారు ఇద్దరినీ అసలు వద్దని చెప్పారట. మరి వాళ్ళు ఎక్కువగా అడిగారా లేక ఇంకా ఏదైనా కారణం ఉందా అనేది స్పష్టత మాత్రం లేదు. అగ్ర హీరోల సినిమాలకు వాళ్ళు అయితే అది ఇంకా భారం అని చెప్పారట కొందరు. 

 

అందుకే వాళ్ళను పక్కన పెట్టారు అని అంటున్నారు. ఇక ఇప్పుడు నదియా కు తమిళంలో మంచి అవకాశాలు వస్తున్నాయు. ఇటీవల త్రివిక్రమ్ సినిమాలో ఆమెను తీసుకోవాలి అని భావించినా సరే ఆమెను వద్దు అని చెప్పారట. మరి అది ఎంత వరకు నిజం అనేది ఇంకా తెలియదు. ఎన్టీఆర్ ఆమెను వద్దన్నాడు అని మరొకరిని చూడాలి అని చెప్పాడు అని టాక్ వినపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: