ఇండియన్ మోస్ట్ ప్రస్టేజియస్ మూవీ ఆర్ఆర్ఆర్ కు ఎదురుదెబ్బ తగిలింది. రాజమౌళికి ఉన్న క్రేజ్.. నమ్మకంతో.. కొన్ని ఏరియాలకు అడ్వాన్స్ లు ఇచ్చేశాడు. కరోనా విజృంభణ.. ఇప్పట్లో సినిమా వచ్చే అవకాశం లేకపోవడంతో..అడ్వాన్స్ లు తిరిగి ఇచ్చేయాలంటున్నారు. సినిమా ఎంత బాగున్నా.. హిట్ అయినా.. బిజినెస్ విషయంలో డిస్ట్రిబ్యూటర్స్ రిస్క్ తీసుకోవాలనుకోవడం లేదు. 

 

కరోనా వచ్చి థియేటర్స్ మూయించేసింది. షూటింగ్స్ కు బ్రేకులేసింది. సీరియల్స్.. సినిమా షూటింగ్స్ కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా.. నామమాత్రంగానే షూటింగ్స్ మొదలయ్యాయి. నటీనటులు లేకుండా.. డూపులతో ఆర్ఆర్ టీమ్ షూటింగ్ స్టార్ట్ చేసింది. సీన్స్ తీసేందుకు పరిస్థితులు ఎలా ఉంటాయన్న అవగాహన కోసం రెక్కీ నిర్వహించారు. తక్కువ సిబ్బందితో మొదలైనా.. అందరూ కిట్స్ ధరించి షూటింగ్ రిహార్సల్స్ లో పాల్గొన్నారట. ఈ ప్రయోగం ఫలిస్తే నటీనటులతో సన్నివేశాలు తీయడం స్టార్ట్ చేస్తారు. 

 

ఆర్ఆర్ఆర్ షూటింగ్ కు రిహార్సల్స్ స్టార్ట్ చేస్తే.. అడ్వాన్సులు వెనక్కి ఇచ్చేయమంటున్నారట. రాజమౌళి సినిమాకు స్వతహాగా క్రేజ్ ఎక్కువ. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలవడం.. మల్టీస్టారర్ మూవీగా రూపొందడంతో ఈ అంచనాలు ఆకాశానికి తాకాయి. దీనికి తగ్గట్టే.. భారీ మొత్తంలో అడ్వాన్సులు ఇచ్చేశారు. సినిమా ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొనడంతో.. డబ్బులు వెనక్కి ఇచ్చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. 

 

ఆర్ఆర్ఆర్ ఓవర్సీస్ బిజినెస్ ముందుగా జరిగింది. 60కోట్లకు అగ్రిమెంట్ జరిగిందనీ.చ. మూడు కోట్లు అడ్వాన్స్ గా ఇచ్చారని తెలిసింది. ఆర్ఆర్ఆర్ జులై 30న రావాల్సి ఉండగా.. షూటింగ్ ఆలస్యం కావడంతో.. 2021 జనవరి 8న రిలీజ్ అంటూ మరో డేట్ ఎనౌన్స్ చేశారు. ఈ విడుదల తేదీని కరోనా అడ్డుకుంది. 2021 సమ్మర్ లో వస్తుందంటున్నారు. గతంలో మాదిరి థియేటర్ల దగ్గర ఆడియన్స్ జాతర ఇప్పట్లో చూడలేం. అసలు కరోనా ఎప్పుడు తగ్గుతుందో కూడా చెప్పలేని పరిస్థితి. 

మరింత సమాచారం తెలుసుకోండి: