మళ్లీ మళ్లీ ఇది రాని రోజు.. ప్రేమ సినిమాల్లో ఎంతో అద్భుతమైన సినిమా ఇది. ఈ సినిమాలో హీరో, హీరోయిన్ ప్రేమ గురించి చెప్పే డైలాగులు ఎంతో అద్భుతంగా ఉంటాయి. అసలు చూడకుండానే ఒక మనిషిపై ప్రేమ పుట్టడం.. మాట్లాడకుండానే భాద తెలుసుకోవడం అనేది ఈకాలం ప్రేమికులకు అర్ధం కాదు. 

 

అసలు అలాంటి ప్రేమ ఉంటుంది అని కూడా తెలియదు. అలాంటి ప్రేమను ఈ సినిమాలో ఎంతో గొప్పగా చూపించారు. ఎంత గొప్పగా చూపించారు అంటే ఎన్ని సార్లు చూసిన సరే మళ్లీ మళ్లీ ఈ సినిమాను చూడాలి అని అనిపించే రేంజ్ లో సినిమా ఉంటుంది. ఒక్క హీరో హీరోయిన్ మాత్రమే కాదు హీరో తల్లి.. అంటే శర్వానంద్ తల్లి పవిత్ర లోకేష్ పాత్ర కూడా ఎంతో అద్భుతంగా ఉంది.        

 

IHG

 

పవిత్ర లోకేష్ కొడుకుతో మాట్లాడుతూ.. ఒకసారి ప్రేమించరా.. చాలా బాగుంటుంది. అంటూ చెప్పే డైలాగ్ లో ఆమె ప్రేమకు ఇచ్చే విలువ.. కొడుకుపై ఉన్న ప్రేమ ఎంతో చక్కగా కనిపిస్తుంది. అంటే అన్నం అని అంటారు కానీ ఒక తల్లిగా ఈ ఒక్క సినిమాలోనే కాదు ఎన్నో సినిమాల్లో ఎంతో అద్భుతంగా తల్లి పాత్రలో నటించింది. 

 

తల్లి పాత్రలో అద్భుతంగా నటిస్తుంది. రేసుగుర్రం సినిమాలో కూడా తల్లి పాత్రలో ఎంతో ఇన్నో సెంట్ గా నటించి అందిరితో మార్కులు కొట్టేసింది. ఒక్క ఈ సినిమాలోనే కాదు ఎన్నో సినిమాల్లో ఆమె మంచి పాత్రలు చేసింది. ఇలా అన్ని సినిమాల్లోకి మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమాలో పాత్ర చాలా గొప్పగా, హుందాగా, ప్రేమగా ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: