జూనియర్ ఎన్టీయార్ కు దూకుడు ఎక్కువ. ఆయనలో వర్క్ డెడికేషన్ కూడా ఎక్కువే. ఆయన తన తాత మాదిరిగా పని రాక్షసుడు. షూటింగులు ఉంటే దానికే అంకితం అయిపోతాడు. అదే విధంగా గ్యాప్ దొరికితే బాగా ఎంజాయ్ చేస్తాడు. ఇపుడు లాక్ డౌన్ పీరియడ్ ని జూనియర్ చాలా బాగా గడుపుతున్నాడు.

IHG's shredded physique will give you fitness goals ...

తన ఇద్దరు పిల్లలతో జూనియర్ పూర్తి టైం స్పెండ్ చేస్తున్నాడు. తన పిల్లలు ఇద్దరితో ఇంతవరకూ ఇంతలా టైం గడిపే చాన్స్ రాలేదని కూడా జూనియర్ అంటున్నాడు. నిజమే పిల్లలు పుట్టాక కొన్ని రోజులైనా జూనియర్ ఇంటిపట్టున ఉండకుండా షూటింగులు అంటూ కెమెరా బాట పట్టేశాడు.

Trivikram to work with IHG again- The New <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=INDIAN' target='_blank' title='indian-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>indian</a> Express

ఇపుడు అనుకోకుండా దొరికిన సెలవులను జూనియర్ బాగా స్పెండ్ చేస్తున్నాడు. అంతే కాదు జూనియర్ తన తాతగారి సినిమాలు కూడా చూస్తూ టైం పాస్ చేయడమే కాదు, అందులోనే ఎంతో ఆనందం చూసుకుంటున్నాడు. ఇక జూనియర్ లాక్ డౌన్ ఇలా ముగియగానే అలా షూటింగుల్లోకి దూకాల్ని అనుకుంటున్నాడుట.

IHG

ఇప్పటికే ఆర్.ఆర్.ఆర్ మూవీ సెట్స్ మీద ఉంది. దాన్ని ఈ ఇయర్ ఎండింగ్ లో గా పూర్తి చేసి ఆ తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ తో మూవీ చేయాలనుకుంటున్నాడు. . అయినను పోయిరావెలె హస్తినకు అన్న టైటిల్ తో ఈ మూవీ రాబోతోంది. ఈ రెండు మూవీస్ వచ్చే ఏడాది అంటే 2021 నాటికి థియేటర్లలోకి రావచ్చు అంటున్నారు. అంటే వచ్చే ఏడాది జూనియర్ ఫ్యాన్స్ కి డబుల్ బొనాంజా  అన్న మాట. మరి ఆ తరువాత సినిమాలు కూడా జూనియర్ లైన్లో పెడుతున్నాడంటే ఆయన మాస్టర్ మైండ్ కి జోహార్ అనాల్సిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: