కొణిదెల నిహారిక.. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగా బ్రదర్ నాగబాబు ఏకైక కుమార్తె నిహారిక కొణిదెల పెళ్లి గురించి సోషల్ మీడియాలో వార్తలు తెగ హాల్ చల్ చేస్తున్నాయి. ఎన్నో ఏళ్ళ నుండి పెళ్లి గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. అలాంటిది నిహారికనే ఇప్పుడు పెళ్లి గురించి ఒకొక్కటి రివీల్ చేస్తుంది. 

 

IHG

 

దీంతో అభిమానులు అంత ఎంతో ఆసక్తిగా.. ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇంకా గాసిప్ లు రాసేవారు అయితే గుంటూరుకు చెందిన అబ్బాయిని నిహారిక పెళ్లాడబోతున్నారని, అతని పేరు చైతన్య అని, ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి కుమారుడని గాసిప్ లు వినిపిస్తున్నాయి. ఇంకా త్వరలోనే వీరి పెళ్లికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడుతుందని అంటున్నారు. 

 

IHG

 

దీంతో నిహారిక భర్త ఎవరు? నిహారిక కంటే అందంగా ఉంటాడా? అని కామెంట్లు చేస్తూ ఫేస్ చూడటానికి చాలా ఆతృతగా ఉన్నారు. అయితే ఇప్పుడు తనకు కాబోయే భర్తతో నిహారిక తీసుకున్న ఫొటో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. దీంతో ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంకా ఈ ఫొటోలో కాబోయే భర్తను గట్టిగా హగ్ చేసుకుంది నిహారిక. అయితే ఈ ఫొటోలో కాబోయే భర్త ముఖాన్ని చూపించలేదు. దీంతో ఈ ఫొటోపై మీమ్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోను నిహారిక తన ఇన్‌స్టాగ్రామ్ షేర్ చేస్తూ.. ''Peek-a-boo'' (దాగుడుమూతలు) అనే క్యాప్షన్ పెట్టారు. దీంతో ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Peek-a-boo

A post shared by niharika Konidela (@niharikakonidela) on

మరింత సమాచారం తెలుసుకోండి: