పెంకితనం ఆడతనమైతే అదే అమ్మాయి అవుతుంది.. వసంతం ఒకటి సడన్‌గా అందమైన రూపాన్ని సంతరించుకుంటే.. వెన్నల తన వెర్షన్ మార్చుకొని నీలా అప్ గ్రేడ్ అయ్యిందనిపిస్తుంది.. నవయవ్వన గిరులు ఉప్పొంగే సిరులైతే మగవాడి హృదయం, అలజడితో అణువణువూ తడబడుతుంది. ఆ కంటి కొనల చూపులు బాణాలై మనసును గాయపరుస్తూ ఉంటే మహా శిల్పి తన జీవిత కలనంత నీ చీర కుచ్చిల్ల మద్యలో కూర్చోబెట్టాడని అనిపిస్తుంది.. ఆ వెండితెర ఏ పుణ్యం చేసుకుందో గానీ నీ సొగసుల సోయగాలకు గాలం వేస్తుంటే.. అవి చూసే ప్రేక్షకుల కనులు రెప్పవేయడం మరచి స్ధంభించి పోయాయి..

 

 

తెరపైన కనిపించేది కొన్ని గడియలైనా మళ్లీ మళ్లీ చూడాలని అనిపించేలా చేస్తున్న నీ అభినయానికి, అందానికి అభిమానులుగా మారామని చెప్పడానికి పెదవి వణుకుతుంది. ఎందుకంటే నీ పేరును పలుకుతున్నప్పుడు పెదవిలో పుట్టే మకరందం పుడమి పై ఒలికిపోతుందనే భయం.. వావ్ ఏం చెప్పావు గురువు అంటారా. సరే అంటే అందురు గానీ ఎవరి కోసం చెప్పానో తెలుసుకోరు.. ఈ రోజు అందాల నటి కాజల్ అగర్వాల్ బర్త్‌డే..

 

 

ఇకపోతే 2007 వ సంవత్సరంలో తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్.. 2009 లో హీరో చిరంజీవి తనయుడైన రామ్ చరణ్‌తో జోడి కట్టి, రాజమౌళి దర్శకత్వంలో మగధీర చిత్రంలో నటించింది.. అసలు ఆ క్యారెక్టర్‌లో కాజల్‌ను కాకుండా వేరెవరిని ఊహించుకోలేనంతగా అందులో జీవించింది.. ఒకవేళ కాజల్ కనుక ఆ సినిమా చేయక పోయి ఉంటే పరిస్దితి మరోలా ఉండేది..

 

 

ఇక అప్పటి వరకు కాజల్ అగర్వాల్ అంటే అంతగా పరిచయం లేని వారి దృష్టిలో కూడా చెరగని స్దానాన్ని సంపాదించుకుంది.. ఈ చిత్రం కంటే ముందు చందమామ, పౌరుడు, భైరవ, ఆటాడిస్తా అనే చిత్రాలు చేసినా సరైన గుర్తింపు లభించలేదు.. కానీ మగధీరతో అందాల యువరాణిగా, యువకుల కలల రాణిగా మారిపోయింది.. అలా 2018 వరకు తిరుగు లేకుండా వెండితెరను ఏలింది.. ప్రస్తుతం కాస్త స్పీడ్ తగ్గినా, తనకున్న ఇమేజ్ అలాగే ఉంది.. ఇక 35 ఐదేళ్ల వయస్సులో కూడా ఏమాత్రం చెదరని అందంతో ఈ చందమామ ఇప్పటికి అభిమానుల గుండెల్లో సెగలు రేపుతుంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: