సినిమాల్లో కమర్షియల్, క్లాసిక్, ఆర్ట్.. ఫిలింస్ ఉంటాయి. కానీ.. కొన్ని స్టోరీ బేస్డ్ సినిమాలు మంచి ఎక్స్ పీరియన్స్ ఫిలింస్ గా నిలిచిపోతాయి. ఇటువంటి మూవీస్ హిట్, ఫ్లాప్ లకు అతీతంగా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తాయి. ఇటువంటి జోనర్లోకి వచ్చే మూవీనే మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన ‘అంజి’. టాలీవుడ్ లో అప్పటికి హయ్యస్ట్ బడ్జెట్ 25కోట్లతో భారీగా తెరకెక్కిన సినిమా అంజి. దాదాపు ఏడేళ్లు షూటింగ్ జరుకుంది ఈ సినిమా. ధియేటర్లో ఈ సినిమా ప్రేక్షకుల్ని కొత్త లోకంలోకి తీసుకెళ్లి మంచి అనుభూతిని ఇస్తుంది.

IHG

 

ఇప్పటికీ టవీల్లో టెలికాస్ట్ అయితే ఈ సినిమాకు మంచి ఆదరణ వస్తుంది. కారణం సినిమాలోని కథాంశమే. తొలి అరగంటలో వచ్చే కథ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. సినిమాలో చిరంజీవికి ఆత్మలింగం దొరికే సన్నివేశం ప్రేక్షకుల్ని ఆశ్చర్యానుభూతికి లోనయ్యేలా చేస్తుంది. అడవిలో చిరంజీవి హార్స్ రైడింగ్ సినిమాలో యాక్షన్ స్థాయిని చూపిస్తుంది. సినిమా క్లైమాక్స్ ఓ అద్భుతాన్నే ఆవిష్కరిస్తుంది. గ్రాఫిక్స్ లో ‘శివుడు’ ప్రత్యక్షమవటం ప్రేక్షకులకు ఆధ్యాత్మిక భావన తీసుకొస్తుంది. ఈ సన్నివేశంలో ప్రేక్షకులకు నిజంగా శివ దర్శనం అయిన అనుభూతే కలుగుతుందనడంలో ఆశ్చర్యం లేదు.

IHG

 

ఇన్ని విశేషాలతో ఈ సినిమా అన్నేళ్లు షూటింగ్ జరుపుకుంది. దీంతో మంచి కథాంశం ఉన్న ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ దక్కింది. సినిమా 100 రోజులు ఆడినా కమర్షియల్ గా కంటే మంచి ఎక్స్ పీరియన్స్డ్ మూవీగా నిలిచిపోయింది. ఇప్పటికీ ఈ సినిమాను టీవీల్లో చూసే ప్రేక్షకులు అనిర్వచనీయమైన అనుభూతికి లోనవుతూ ఉంటారు. అంతటి శక్తివంతమైన కథాంశం ‘అంజి’లో ఉంది. సినిమా కోసం దర్శకుడు, నిర్మాత, హీరో పడిన కష్టమంతా తెరపై కనిపిస్తుంది. అందుకే ప్రతి ఏటా శివరాత్రి పర్వదినాన ఈ సినిమా టెలికాస్ట్ అవుతూనే ఉంటుంది.

IHG

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: