ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్ మూవీస్‌ కి కేరాఫ్ అడ్ర‌స్ ‌గా నిల‌చిన కథానాయకుడు నటసింహ నందమూరి బాలకృష్ణ. బ్లాక్ బస్టర్ మూవీస్ తరువాత బాలయ్య నటించిన మరో ఫ్యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘చెన్నకేశవరెడ్డి’. వెండితెరపై కొన్ని సినిమాలు ఆశించిన విజ‌యం సాధించ‌క‌పోయినా ఏదో రూపంలో గుర్తుండిపోతాయి. అలా నంద‌మూరి బాల‌కృష్ణ కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రం 'చెన్న‌కేశ‌వ‌రెడ్డి'. ఇందులో బాల‌కృష్ణ తండ్రీకొడుకులుగా రెండు పాత్ర‌లు పోషించాడు. ఒక‌టి చెన్న‌కేశ‌వ రెడ్డి కాగా.. రెండోది భ‌ర‌త్‌. ఈ రెండు పాత్ర‌ల్లోనూ వేరియేష‌న్ చూపిస్తూ.. బాల‌య్య చాలా బాగా న‌టించాడు.

 

 

'చెన్న‌కేశ‌వ‌రెడ్డి' పాత్ర‌లో ప‌గ‌, ప్ర‌తీకారం తాలుకు ఇంటెన్సిటీ ఎక్కువ‌గా ఉంటే.. కొడుకు భ‌ర‌త్‌ ది సిన్సియ‌ర్ పోలీస్ పాత్ర‌. ఈ రెండు పాత్ర‌ల ప‌రంగా బాల‌య్య తీసుకున్న శ్ర‌ద్ధ సినిమాలో స్ప‌ష్టంగా తెలుస్తుంది. 'ఆది' వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌రువాత వి.వి.వినాయ‌క్ రూపొందించిన చిత్ర‌మిది. బెల్లంకొండ సురేష్ నిర్మించిన ఈ చిత్రంలో క‌మ‌ర్షియ‌ల్ అంశాలకు తక్కువేమీ లేదు. కానీ సినిమాని రాంగ్ టైమ్‌లో రిలీజ్ చేయ‌డం పెద్ద మైన‌స్ అయ్యింది.

 

 

ఆ ఏడాదిలో అప్ప‌టికే 'ఆది', 'ఇంద్ర'.. ఇలా వ‌రుస‌గా ఫ్యాక్ష‌న్ చిత్రాలు రావ‌డంతో అది 'చెన్న‌కేశ‌వ‌రెడ్డి' ఫ‌లితంపై పడింద‌న్న‌ది ట్రేడ్ పండితుల మాట‌. అయితే ఫ్యాక్ష‌నిజాన్ని పీక్స్‌లో చూపించిన చిత్రంగా.. బాల‌కృష్ణ న‌ట‌నని స‌రైన రీతిలో వాడుకున్న చిత్రంగా 'చెన్న‌కేశ‌వ‌రెడ్డి' గుర్తుండిపోతుంది.

 

 

శ్రియ గ్లామ‌ర్ పాత్ర‌లో.. టాబు పెర్‌ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్ర‌లో బాల‌కృష్ణ‌కి జోడీగా న‌టించారు. ఇక బాల‌య్య చెల్లెలుగా దేవ‌యాని చేసిన పాత్ర గుర్తుండిపోతుంది. మ‌ణిశ‌ర్మ సంగీతంలోని పాట‌లు సినిమాకి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ కాగా.. నేప‌థ్య సంగీతం సినిమాకి ఓ ఎస్సెట్‌గా నిలిచింది.కానీ ఈ సినిమా బుల్లితెరపై చాల పేరును సంపాదించి పెట్టింది. వెండితెరపై  అందరి ఆదరణ పొందకపోయిన బుల్లితెరపై వచ్చి ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: