పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రెజ్ అంత ఇంతాకాదు. ఆయన కెరీర్ లో బ్లాక్ బస్టర్ కాకపోయినా మంచి టాక్ పొందిన సినిమా జల్సా. ఈ తొలిరోజే మళ్లీ యావరేజ్ టాక్ సినిమాలో పెద్దగా విషయం లేదు.. కామెడీ తప్ప ఇంకేం లేదన్నారు. కానీ ఖుషీ తర్వాత ఏడేళ్ల పాటు ఒక్క విజయం అంటూ వేచి చూసిన పవన్ అభిమానులకు మాత్రం జల్సా ఓ విందు భోజనం అయిందంట. ఈ సినిమా కమర్షియల్‌గా సంచలనం. 2008లోనే 33 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది జల్సా. పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్‌కు బీజం వేసింది ఈ చిత్రం. 

 

 

అలాంటి సమయంలో వచ్చిన జల్సా సంచలనం సృష్టించింది. ముఖ్యంగా కొడుతున్నారమ్మా అంటూ బ్రహ్మానందం చెప్పిన డైలాగ్ ఇప్పటికీ ఫేమస్. పది రూపాయలు ఇచ్చి 1000 అని చెప్పడం.. పవన్, ఇలియానా సీన్స్.. పవన్‌, బ్రహ్మానందం ఎపిసోడ్స్ ఇలా అన్నీ అదిరిపోయాయి. మరోవైపు ప్రకాష్‌ రాజ్‌ కామెడీ సీన్స్‌ కూడా సినిమాకు ప్రాణం.

 

 

మహేష్ బాబు వాయిస్ ఓవర్ మరో బలం. సినిమాలో పవన్ నక్సలిజం ఫ్లాష్‌ బ్యాక్‌ కూడా అదనపు ఆకర్షణ. అయితే సినిమా ఎలా ఉన్నా కూడా ప్రతీ సీన్‌లోనూ త్రివిక్రమ్‌ తన మ్యాజిక్‌ చూపించాడు. మాటలతో మాయ చేసాడు. కామెడీతో పాటు ఆలోచింపజేసే మాటలు, డైలాగ్‌లకు జల్సా కేరాఫ్‌ అడ్రస్‌. విలన్‌ను రక్తపు చుక్క రాకుండా.. ఒక్కసారి కూడా ఆయన్ని కొట్టకుండా చంపే క్లైమాక్స్ కూడా అద్భుతమే.

 

 

యుద్ధంలో గెలవడం అంటే శత్రువును ఓడించడమే కానీ చంపడం కాదంటూ త్రివిక్రమ్ చెప్పిన ఫిలాసఫీ కూడా బాగానే వర్కవుట్ అయింది. మొత్తంగా దేవీ పాటలు దుమ్ము దులిపేసాయి. అన్నీ కలిపి అప్పటి వరకు తెలుగు సినిమాలో ఉన్న కమర్షియల్ రికార్డుల్లో చాలా వరకు జల్సా తన పేర రాసుకుంది. పవన్ కోరుకున్న విజయాన్ని అందించింది ఈ చిత్రం.

మరింత సమాచారం తెలుసుకోండి: