కొన్ని కాంబినేషన్లు సెంటిమెంట్ గా మారిపోతాయి. సక్సెస్ అయినా.. ఫ్లాప్ అయినా ఆ కాంబినేషన్లకు క్రేజ్ మాత్రం అలానే ఉంటుంది. టాలీవుడ్ లో దర్శకుడు శ్రీను వైట్ల, రచయితలు కోన వెంకట్, గోపీ మోహన్ ల కాంబినేషన్ కు ఇటువంటి క్రేజే ఉంది. వీరు ముగ్గరూ కలిసి ఎన్నో మ్యాజికల్ హిట్ సినిమాలు ఇచ్చారు. అందులో ఒకటి ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా వచ్చిన ‘రెడీ’ కూడా ఉంది. పూర్తి కుటుంబ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో శ్రీను వైట్ల మార్క్ కామెడీ ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమా విడుదలై నేటికి 12 ఏళ్లు పూర్తయ్యాయి.

IHG

 

బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా 2008 జూన్ 19న విడుదలైంది. ఇద్దరు అన్నదమ్ముల కుటుంబాల మధ్య ఉండే గొడవను కూడా కథలో భాగంగా కామెడీ పండించారు ఈ ముగ్గురూ. ఇందుకు ఓ ప్రేమ జంటను మధ్యలో పెట్టి సినిమా ఆద్యంతం హాస్యానికి పెద్ద పీట వేశారు. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు హాయిగా నవ్వుకుని మళ్లీ మళ్లీ రిపీట్ చేశారు. హీరోగా రామ్ ఎనర్జీ, జెనీలియా చలాకీతనం సినిమాలో ఆకట్టుకుంటుంది. బ్రహ్మానందం, మాస్టర్ భరత్, కోట శ్రీనివాసరావు, జయప్రకాశ్ రెడ్డి, ఎమ్మెస్, ధర్మవరపు, సునీల్.. కామెడీ సినిమాను ఓ స్థాయిలో నిలబెట్టింది.

IHG

 

సినిమాలో క్యాస్టింగ్ ఎక్కువగా కనిపిస్తుంది. ఆడిటర్ గా బ్రహ్మానందం కామెడీ సినిమాకు ప్లస్. దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలోని పాటలన్నీ హిట్టయ్యాయి. కోన వెంకట్, గోపీ మోహన్ కథకు శ్రీను వైట్ల మార్క్ తన మార్క్ కామెడీ టచ్ ఇచ్చారు. స్రవంతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా శతదినోత్సవ సినిమాగా నిలిచింది. ఈ సినిమా హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా ‘రెడీ’ గానే రీమేక్ అయింది.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: