సినిమా ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇటీవలే కన్నడ హీరో చిరంజీవి సత్య మరణించగా, బాలీవుడ్ సూపర్ హీరో సుశాంత్ తనువు చాలించాడు. తాజాగా ప్రముఖ మలయాళ దర్శకుడు కె.ఆర్ సచ్చిదానంద కన్నుమూశారు. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన త్రిసూర్ లోని ఓ హాస్పిటల్ లో ప్రాణాలు విడిచారు. దీంతో సినిమా ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. సినీ పరిశ్రమకు వచ్చిన కొద్ది రోజులకే జీవితం అర్ధాంతరంగా ముగిసిపోవడం పలువురిని కలచివేసింది. సచ్చిదానంద ఇటీవల తుంటి ఆపరేషన్ చేయించుకున్నాడు. ఆ తర్వాత ఈ నెల 16 వ తారీఖున హఠాత్తుగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్ కి తరలించారు.

IHG

పరిస్థితి క్రమంగా విషయం నుంచి గురువారం రాత్రి ప్రాణం విడిచారు. అంతకుముందు కేరళ హైకోర్టులో ఎనిమిది సంవత్సరాలు లాయర్ గా పనిచేసిన ఆయన 2018 లో దర్శకుడిగా సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు. సినిమా ఇండస్ట్రీలోకి స్నేహితుడు సేతునాథ్ తో కలిసి సచ్చి రచయితగా సినిమా రంగంలో అడుగు పెట్టారు. సచ్చి-సేతు కామినేషన్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన చాక్లెట్, మేకప్ మాన్, రాబిన్ హుడ్ వంటి సినిమాలకు రచయితగా ఉన్నాడు.

IHG

ఆ తర్వాత పృథ్వి రాజ్ నటించిన అనార్కలి సినిమాతో దర్శకుడిగా మారాడు. తన రెండవ సినిమా అయ్యపనుమ్ కోశియుమ్ తోనే భారీ విజయాన్ని అందుకున్నారు. పృథ్వీ సుకుమారన్ హీరోగా నటించిన అయ్యపనుమ్ కోశియుమ్ ఈ సినిమా ఈ ఏడాది సంచలన విజయాన్ని నమోదు చేసింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: