రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 20వ సినిమా టైటిల్ విషయంలో క్లారిటీ వచ్చింది. మొదట జాన్ అనే టైటిల్ పెట్టాలనుకున్నప్పటికీ  శర్వానంద్  96 రీమేక్ కోసం ఆ టైటిల్ ను త్యాగం చేశారు. ఆతరువాత ఫిలిం ఛాంబర్ లో ఓ డియర్ , రాధే శ్యామ్ అనే టైటిల్ లను రిజిస్టర్ చేయించారు. ఇందులో సినిమా టైటిల్ గా ఓ డియర్ పేరు ఎక్కువగా వినిపించింది అయితే కొద్దీ రోజుల నుండి ప్రభాస్ 20 టైటిల్ .. రాధే శ్యామ్ అంటూ ఫ్యాన్స్  సోషల్ మీడియా లో హడావిడి చేస్తున్నారు.
 
ఇక ఈసినిమాకు మేకర్స్ కూడా రాధే శ్యామ్ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు  సమాచారం. మరోవైపు  రాధే శ్యామ్ ఫస్ట్ లుక్ కూడా రెడీ అయిపోయింది. అన్ని కుదిరితే  ఈనెల 22న టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను  విడుదలచేయాలని యువీ క్రియేషన్స్ భావిస్తుంది. ఒక వేళా ఇదే డేట్ ను గనుక ఫిక్స్ చేస్తే  ఆదివారం ఈవిషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు.  తెలుగు తోపాటు తమిళ ,హిందీ భాషల్లో రానున్న ఈచిత్రం పై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు వున్నాయి. ఈ చిత్రం ఇటీవల జార్జియా లో ఓ కీలక షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. ఆగస్టు లో తదుపరి షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నారు.
 
జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ డైరెక్ట్  చేస్తున్న ఈచిత్రంలో పూజా హెగ్డే  హీరోయిన్ గా నటిస్తుండగా యువీ క్రియేషన్స్ తో కలిసి గోపికృష్ణ మూవీస్ నిర్మిస్తుంది. ఇక ఈ సినిమా తరువాత ప్రభాస్, నాగ్ అశ్విన్  డైరెక్షన్ లో నటించనున్నాడని తెలిసిందే. ఈసినిమాను భారీ బడ్జెట్ తో వైజయంతి మూవీస్  నిర్మించనుంది. వైజయంతి మూవీస్ కు ఇది 50వ సినిమా కావడం విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి: