తెలుగు బుల్లితెర లో యాంకర్లు మంచి స్పీడ్ లో ఉన్నారు. ప్రోగ్రాం ల మీద ప్రోగ్రాం లు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయారు. కేవలం బుల్లితెరపై మాత్రమే కాదు సిల్వర్ స్క్రీన్స్ పైన కూడా ఈ అందాల భామలు తళుక్కుమంటున్నారు. చేతికందిన అవకాశాలు అందిపుచ్చుకొని షూటింగ్ లలో బిజీ బిజీ అయిపోయారు. అయితే ఈ మధ్య కాలంలో లాక్ డౌన్ ఉండటం వలన అటు వెండి తెర ఇటు బుల్లి తెర రెండు ఇండస్ట్రీ లకు షూటింగ్ లు లేకుండా పోయాయి.    ఇండస్ట్రీ వాళ్లంతా ఇళ్లకే పరిమితమైపోయారు. దాదాపు రెండు నెలలు పైనే ఇళ్లకే పరిమితమైపోయారు. 

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Did what I love doing.. refreshed and renewed myself.. my look.. my mind.. my spirit.. and then got back to work! love you @sachindakoji !!! For attending to me and bringing out a new version of how I can look always! ❤️🤗 @zamms.in 😊

A post shared by anasuya Bharadwaj (@itsme_anasuya) on

 

గత కొన్ని రోజుల క్రితమే నెమ్మనెమ్మదిగా షూటింగ్ లకు అనుమతులు లభిస్తున్నాయి. అయితే గతంలో మధ్యలో ఆగిపోయిన ప్రాజెక్టు లు ఇపుడు కొత్తగా షూటింగ్ ప్రారంభించబోయే కథలు పట్టాలెక్కబోతున్నాయి. అటు అందాల భామలు కూడా హాట్ హాట్ ఫాట్ షూట్ లతో మళ్ళీ షూటింగ్ లకు రెడీ అవుతున్నారు. ఆ కోవలోనే బుల్లితెర అందాల భామ యాంకర్ అనసూయ కూడా షూటింగ్‌లకు సిద్ధమవుతోంది. లాక్‌డౌన్ కారణంగా ఇన్ని రోజులూ ఇంటికే పరిమితమైన అనసూయ పలుసార్లు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటించింది. ఇక, లాక్‌డౌన్ ముగిసి షూటింగ్‌లకు సిద్ధమవుతున్న తరుణంలో సరికొత్త లుక్ తో తన ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది. విదేశీ యువతి తరహాలో సరికొత్త హెయిర్ స్టైల్‌తో అనసూయ ముస్తాబైంది. 

 


ఆ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ` నా లుక్, నా మైండ్, నా ఆలోచనలు.. నూతన ఉత్సాహంతో సరికొత్తగా మళ్లీ షూటింగ్‌లకు హాజరవుతున్నాన`ని అనసూయ కామెంట్ చేసింది. మళ్ళీ అందాల నటి మళ్ళీ ఫామ్ లోకి వచ్చిందని అనసూయ అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు.అనసూయ అందాలు చూసిన నెటిజన్లు సూపర్, వాహ్వా, అదుర్స్ అంటూ కొత్త కొత్త కామెంట్లతో తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: