కొణిదెల వారింట్లో త్వరలో పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కుమార్తె నిహారికకు పెళ్లి కుదిరిన విషయం తెలిసిందే. నిన్నటి నుంచి వైరల్ అయిన ఈ విషయంపై క్లారిటీ వచ్చింది. గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్ రావు కుమారుడు జొన్నలగడ్డ వెంకట చైతన్యతో నిహారిక పెళ్లి జరుగబోతోంది. పెద్దలు కుదిర్చిన ఈ సంబంధం వెనుక పెదనాన్న మెగాస్టార్ చిరంజీవి కీలకంగా వ్యవహరించారని తెలుస్తోంది. చిరంజీవిని నిహారిక డాడీ అనే పిలుస్తుంది. చిరంజీవి కూడా నిహారికను సొంత కూతురిలానే చూస్తారనే విషయం తెలిసిందే. దీంతో నిహారిక పెళ్లి బాధ్యతను తీసుకున్నారని అంటున్నారు.  

IHG

 

చిరంజీవి తండ్రి వెంకట్రావుకు చైతన్య తల్లి పద్మ తండ్రి గుణ వెంకటరత్నం గతంలో ఫ్యామిలీ ఫ్రెండ్ అని తెలుస్తోంది. ఇదే విధంగా చిరంజీవికి చైతన్య తండ్రి ప్రభాకర్ రావుకు కూడా మంచి స్నేహం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఓ సందర్భంలో వీరి మధ్య వచ్చిన మాటల్లో కుమారుడి పెళ్లి ప్రస్తావన తెచ్చారట ప్రభాకర్ రావు. దీంతో చిరంజీవి ఆయన వద్ద కూతురు నిహారిక ప్రస్తావన తీసుకొచ్చారట. ఇద్దరి జంట బాగుంటుందని అన్నారట. ఈ ప్రపోజల్ ప్రభాకర్ రావుకు నచ్చి ఓకే అనడంతో రెండు కుటుంబాల మధ్య స్నేహం బంధుత్వంగా మారబోతోందని అంటున్నారు.

IHG

 

చైతన్య బిట్స్ పిలానీలో ఇంజనీరింగ్ చేసి టెక్ మహీంద్రాలో మంచి హోదాలో ఉన్నాడట. ప్రస్తుతం నిహారిక-చైతన్య పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఇద్దరి జంట కూడా చూడ ముచ్చటగా ఉంది. వీరి ఎంగేజ్ మెంట్ ఆగష్టు 13న జరుగుతుందని తెలుస్తోంది. చిరంజీవి తోబుట్టువులకు సంబంధించిన విషయాల్లో పెద్దగా వ్యవహరిస్తారన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిహారిక పెళ్లి విషయంలో బాధ్యత తీసుకున్నారని తెలుస్తోంది. ఈ న్యూస్ తో మెగా అభిమానులు కూడా ఖుషీ అవుతున్నారు.

IHG

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: