మొదటి సినిమాతో మంచి హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న నభా నటేష్ ఆ తర్వాత పూరి జగన్నాధ్ దర్శకత్వం లో వచ్చి సంచలన విజయం సాధించిన ఇస్మార్ట్ శంకర్ తో భారీ సక్సస్ ని తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాలో నభా ని పూరి చూపించిన విధానానికి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇక రాం తో చేసిన రొమాన్స్ అలాగే స్క్రీన్ మీద తన గ్లామర్ పర్ఫార్‌మెన్స్ కి నభా వరసగా సినిమాలలో అవకాశాలు అందుకుంటుంది.

 

ఇస్మార్ట్ శంకర్ తర్వాత మాస్ మహారాజ రవితేజ నటించిన డిస్కోరాజా లో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో కూడా ప్రేక్షకులకు గ్లామర్ ట్రీట్ బాగానే ఇచ్చింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ ఫ్లాప్ గా మిగిలింది. ఈ సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోదామనుకున్న నభా ఆశల మీద డిస్కోరాజా నీళ్ళు చల్లింది. దాంతో నభా మళ్ళీ కొత్తగా తనని తాను ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

 

ఇక ప్రస్తుతం నభా నటేష్ మెగా హీరో సాయి ధరం తేజ్ సరసన నటిస్తుంది. సోలో బ్రతుకే సో బెటరు అన్న టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో సోలో హీరోయిన్ గా నటిస్తుంది. దాంతో ఈ సినిమా మీద భారీగా ఆశలు పెట్టుకుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి "నో పెళ్ళి" అన్న సాంగ్ ని రిలీజ్ చేయగా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయి సాయి ధరం తేజ్ కెరీర్ లో హెయ్యెస్ట్ వ్యూస్ సాధించిన సాంగ్ గా రికార్డ్ సాధించింది.

 

ఈ సాంగ్ లో సాయి ధరం తేజ్..వరుణ్ తేజ్..రానా దగ్గుబాటి ఉన్నప్పటికి నభా తన గ్లామర్ తో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. దాంతో నభా బాగా రిజిస్టర్ అయింది. అయితే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలీక నభా మరోసారి తన ఆశలు ఆవితవుతాయా అని టెన్షన్ పడుతుందట. 

మరింత సమాచారం తెలుసుకోండి: