పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం శ్రీరాం వేణు దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ పాల్గొనాల్సిన కొద్ది రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందట. మిగతా కొన్ని రోజుల టాకీ పార్ట్ ని నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ళ, ప్రకాష్ రాజ్, సినియర్ నరేష్ ల మీద చిత్రీకరిస్తారట. ఇందుకోసం అన్నపూర్ణ స్టూడియో కోర్ట్ సెట్ కూడా సిద్దంగా ఉంది.

 

ఇక ఈ సినిమా తర్వాత క్రిష్ తెరకెక్కించే సినిమాలో పవన్ కళ్యాణ్ నటించేందుకు రంగం సిద్దం అవుతోంది. అయితే ఈ సినిమా కూడా పవన్ కళ్యాణ్ లేకుండానే క్రిష్ మిగతా నటీనటుల కాంబినేషన్ లో కొన్ని కీల సన్నివేశాలను ను చిత్రీకరించాడు. ఇక ‘వకీల్ సాబ్’కంప్లీట్ చేశాక పవన్ డేట్లు సర్ధుబాటు చేస్తే ఆయన కి సంధించిన షూటింగ్ ను ప్లాన్ చేస్తున్నాడు. ఇందులో భాగంగా అల్యూమీనియం ఫ్యాక్టరీలో భారీ సెట్ ను  నిర్మించారు.

 

దాదాపు కోటి రూపాయలకి పైగా ఖర్చు చేసి నిర్మించిన ఆ సెట్ లోనే కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉంది. సముద్రం అలాగే భారీ ఓడ సెట్ ను అల్యూమీనియం ఫ్యాక్టరీలో నిర్మాత ఏ.ఎం.రత్నం నిర్మించారట. తాజాగా భారీ వర్షాలు కురియడంతో ఆ సెట్ మొత్తం కూలిపోయిందని తాజా సమాచారం. దాంతో ఏకంగా కోటి రూపాయల నష్టం వాటిల్లిందని తెలుస్తుంది.

 

దాదాపు మూడు నెలల విరామం తర్వాత వకీల్ సాబ్ చిత్రీకరణ ప్రారంభం అయ్యింది. పవన్ కళ్యాణ్ ఉన్న సన్నివేశాలతో సహా వకీల్ సాబ్ చిత్రీకరణ జులై మొదటి వారం వరకు పూర్తవుతుందని తెలుస్తుంది. దాంతో ఆగస్టు నుండి ఆ భారీ సెట్ లో పవన్ మీద సీన్స్ ని చిత్రీకరించేందుకు క్రిష్ ప్లాన్ చేశాడు. ఇప్పుడంతా మట్టిపాలయిందట. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: