దాదాపు రెండు సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్....వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ అనే సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఒకవైపు రాజకీయాలు చేస్తూనే మరోవైపు సినిమా రంగంలో వరుసపెట్టి సినిమాలు ఒప్పుకొని మెగా అభిమానుల దాహం తీర్చడానికి పవన్ కళ్యాణ్ రెడీ అయ్యారు. ‘వకీల్ సాబ్’ సినిమా షూటింగ్ జరుగుతున్న తరుణంలోనే క్రిష్ మరియు హరీష్ శంకర్ సినిమాలను కన్ఫామ్ చేయడం జరిగింది. అంతేకాకుండా క్రిష్ సినిమా కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మొఘలుల కాలం నాటి పీరియాడికల్ డ్రామా టైపులో కోహినూర్ వజ్రానికి సంబంధించి కథలో క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ సినిమా చేస్తున్నారట.

 

ఇదిలా ఉండగా ఈ సినిమా కోసం ఇటీవల హైదరాబాద్ నగరంలో అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్ నిర్మించారట. సహజ సముద్రాన్ని తలపించేలా భారీ స్థాయిలో విశాలంగా ఈసెట్ తో పాటు  ఓడ సెట్ కూడా వేశారట. ఎన్నో ప్రత్యేకలతో సెట్‌ని రూపొందించినట్టు తెలుస్తుండగా, రీసెంట్‌గా హైదరాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షం వలన సెట్  పూర్తిగా ధ్వంసమైనట్టు తెలుస్తోంది. అసలే లాక్ డౌన్ కారణంగా ఇప్పటికే షూటింగ్ ఆలస్యమైంది.

 

ఇటువంటి తరుణంలో ఈ భారీ సెట్ కి భారీ డ్యామేజ్ జరగటంతో నిర్మాతలకు భారీ నష్టం చేకూరింది అని ఫిలింనగర్ లో వార్తలు వినపడుతున్నాయి. దాదాపు ఈసెట్ సుమారు కోటి రూపాయలు పెట్టి వేసినట్లు వార్తలు అందుతున్నాయి. దీంతో సినిమా షూటింగ్ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. ఆగస్టు నెల నుండి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేద్దాం అని పవన్ కళ్యాణ్ భావించడంతో… తాజాగా జరిగిన ఈ ఘటనతో మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని టాక్.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: