మన తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడిన తారక్ ఆ తర్వాత మాత్రం వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ప్రతీ సినిమా హిట్ కొడుతున్నాడు ఈ మధ్య కాలంలో. అతని నటన అతను చేసే పాత్రలు అన్నీ కూడా జనాలకు ఇంకా గుర్తు ఉన్నాయి అనే చెప్పాలి. కొన్ని కొన్ని సినిమాలు ఈ మధ్య కాలంలో వంద కోట్ల కలెక్షన్ తో పాటుగా జనాలు మర్చిపోలేని విధంగా ఉంటున్నాయి. ఇక అందులో జనతా గ్యారేజ్ సినిమా కూడా ఒకటి అనే చెప్పాలి. 

 

సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తారక్ నటన చాలా బాగా నచ్చింది జనాలకు అనేది వాస్తవం. ఈ సినిమాలో తారక్ జీవించాడు అంటారు. ఇక సమంతా ను ప్రేమించే విషయంలో తారక్ తన ప్రేమను చెప్పే క్రమంలో ఉన్న సీన్ ఒకటి జనాలకు బాగా నచ్చింది అనే చెప్పాలి. వాళ్ళు ఇద్దరూ కూడా పెళ్లి కుదిరింది అనే సమయంలో ఒక గది లో ఉండి తమ ప్రేమను చెప్పుకుంటారు. ఒకరు అంటే ఒకరికి చిన్న నాటి నుంచి ఎంత ఇష్టం ఉంది అనేది చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. ఆ సీన్ ఇంకా టాలీవుడ్ జనాలకు బాగానే గుర్తు ఉంది అని చెప్పాలి. 

 

ఆ సీన్ కి సినిమాలో చాలా మంచి మార్కులు పడ్డాయి అని చెప్తారు జనాలు. ఇక ఈ సినిమా వసూళ్లు కూడా బాగానే వచ్చాయి. ఈ సినిమాలో కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ నటించిన సంగతి తెలిసిందే. ఆయన చాలా బాగా ఆకట్టుకున్నారు. చాలా హుందా గా నటించారు అనే పేరు కూడా వచ్చింది. ఇక ఇతర నటులు కూడా ఈ సినిమాలో తమ మార్క్ చూపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: