తమిళ సినిమానే అయినా 7/G బృందావన కాలని తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. సెల్వ రాఘవన్ డైరక్షన్ లో ఏ.ఎం.రత్నం తనయుడు జ్యోతి కృష్ణ హీరోగా సోని అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా అప్పటి యూత్ ఆడియెన్స్ మనసుని వెంటాడే సినిమాగా మిగిలింది. ఆవారాగా తిరిగే హీరో అదే కాలనీకి కొత్తగా వచ్చిన హీరోయిన్. ఆమెకు దగ్గరవ్వాలని హీరో చేసే ప్రతి ప్రయత్నం ఫెయిల్ అవుతూ వస్తుంది. హీరో మీద నెగటివ్ ఇంప్రెషన్ ఏర్పరచుకున్న హీరోయిన్ తర్వాత అతన్ని ప్రేమిస్తుంది.

 

ఈ సినిమాలో ప్రేమకథతో పాటుగా మనిషిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది దాన్ని బయటకు తీస్తే చాలు అన్నది కూడా చూపించాడు. హీరో తండ్రి సైతం ఎందుకు పనికిరాడు అనుకున్న వాడిని హీరో హోండా కంపెనీలో జాబ్ తెచ్చుకునేలా చేస్తుంది హీరోయిన్. ఇక ఈ సినిమా క్లైమాక్స్ అయితే మనసుని తాకుతుంది. హీరోయిన్ చనిపోయినా సరే హీరో ఆమె జ్ఞాపకాలతోనే బ్రతకడం లాంటివి చూసి సినిమా నుండి బయటకు వచ్చాక కూడా ఆ సినిమా మనల్ని వెంటాడేలా చేస్తుంది.

 

కొన్ని ప్రేమకథలు ఎప్పటికి గుర్తుంటాయి.. అలాంటి ప్రేమకథల్లో 7/G బృందావన కాలని సినిమా ఉంటుంది. హీరో, హీరోయిన్, డైరక్టర్ అంతా తమిళ వాళ్లే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచింది. ఈ సినిమా తర్వాత సెల్వ రాఘవన్ సినిమాలకు తెలుగులో సూపర్ క్రేజ్ వచ్చింది. ఆ క్రేజ్ తోనే విక్టరీ వెంకటేష్ ఆ డైరక్టర్ తో ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే సినిమా చేశాడు. ఆ సినిమా కూడా మంచి సక్సెస్ అందుకుంది.                               

మరింత సమాచారం తెలుసుకోండి: