సినిమాలు అన్న తర్వాత ఎన్నో లవ్ స్టోరీస్  ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే నిజ జీవితంలో కొన్ని లవ్ స్టోరీస్ ఉన్నప్పటికీ సినిమాల్లో మాత్రం ప్రతి సినిమాకి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ లవ్ స్టోరీ ఉంటుంది. ప్రతి సినిమాలో కొత్త లవ్ స్టోరీ లు  చూపించడానికి దర్శకులు  ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు . ఇక సినిమాలోని ఈ లవ్ స్టోరీ లలో హీరోలు హీరోయిన్లను ప్రేమలో పడేయడానికి ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు హీరోయిన్లు ఈజీ గానే ప్రేమలో పడతారు కానీ కొన్ని కొన్నిసార్లు మాత్రం హీరోల కష్టాలు చూస్తుంటే పాపం అనిపిస్తూ ఉంటుంది. 

 


 అయితే కొన్ని కొన్ని సినిమాల్లో కాస్త భిన్నంగా లవ్ స్టోరీలను తెరకెక్కిస్తూ  ఉంటారు దర్శకులు. ఇలాంటి డిఫరెంట్ లవ్ స్టోరీ ఉన్న సినిమాల్లో ఒకటి రెబల్. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాఘవ లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచింది. ఇక విడుదలైన తర్వాత ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయింది అని చెప్పాలి. అయితే ఈ సినిమా టాక్ పరంగా ఎలా ఉన్నప్పటికీ ఈ సినిమాలో ప్రభాస్ తమన్నాను పడేయడానికి మాత్రం ఎంతో కొత్తగా ఆలోచిస్తాడు. 

 


 మామూలుగా అయితే హీరోయిన్లను పొగడడం లేదా అతి మంచితనం చూపించడం... లేదా ఇంకా ఏదైనా కారణాల వల్ల హీరోయిన్ల మదిలో ప్రేమ పుట్టేలా చేస్తూ ఉంటారు. కానీ ప్రభాస్ మాత్రం రొటీన్గా కాకుండా కాస్త భిన్నంగా ట్రై చేసాడు. హీరోయిన్లను పొగడడం కాదు.. ఈ హీరోయిన్ కంటే నా మరదలు ఎంతో అందంగా ఉంటుంది అంటూ హీరోయిన్ లో కుళ్ళు  పుట్టించాడు. ఆ తర్వాత హీరోయిన్ కి కోపం వచ్చి నీ మరదలు ఎవరో చూపించాలి అంటూ కోరడంతో.. అద్దంలో తమన్నా నే  చూపిస్తూ  తానే నా మరదలు బ్యూటిఫుల్ అంటూ చెప్పి తమన్నాని ఫ్లాట్ చేసేస్తాడు రెబల్ స్టార్ ప్రభాస్.

మరింత సమాచారం తెలుసుకోండి: