ఇప్పుడు రాజకీయ నేపధ్యం ఉన్న సినిమాలను చెయ్యాలి అంటే కచ్చితంగా దర్శక నిర్మాతలు ఒకటికి పది సార్లు ఆలోచన చేసే పరిస్థితి ఉంది అనేది వాస్తవం. అగ్ర హీరోల సినిమాలు అయినా చిన్న హీరోల సినిమాలు అయినా సరే రాజకీయం అనేది సినిమాలో ఉంది అంటే ఆ సినిమా విషయంలో కాస్త ఆలోచన ఉంటుంది. గతంలో మాదిరిగా స్వేచ్చగా చేసే అవకాశం లేదు అనే చెప్పాలి. ఇప్పుడు మహేష్ సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ లోనే రాజకీయం అనేది స్పష్టంగా కనపడుతుంది అని చెప్పాలి. ఇప్పుడు మహేష్ బాబు రాజకీయం విషయంలో మరో సినిమాను లైన్ లో పెట్టే ఆలోచనలో ఉన్నాడు. 

 

అవును రాజమౌళి తో చేసే సినిమా విషయంలో అతను రాజకీయమే కావాలి అని చెప్పాడు అని టాక్. రాజకీయం తనకు బాగా కలిసి వచ్చింది అని గతంలో అతడు గాని దూకుడు గాని సరిలేరు నీకెవ్వరు గాని అలాగే మరి కొన్ని సినిమాలు గాని తనకు రాజకీయం ఉన్నాయి అని అందులో ఆ కాన్సెప్ట్ జనాలకు బాగా నచ్చింది అని భరత్ అను నేను తరహాలో సినిమా ఉంటే అలాంటి సినిమాలను అభిమానులు కచ్చితంగా ఆదరిస్తారు అని మహేష్ బలంగా నమ్ముతున్నాడు ఇప్పుడు. అందుకే కథ విషయంలో అతను  జక్కనను కు ఇప్పటి నుంచే చెప్తున్నాడు అని సమాచారం. 

 

ఇక  జక్కన్న కూడా రాజకీయంగా ఉండే సినిమాను ఇప్పటి వరకు చేసిన సందర్భం లేదు అనే చెప్పాలి. ఇప్పుడు ఆ విధంగా కథను మహేష్ అడిగిన వెంటనే అతను తన తండ్రికి కూడా చెప్పాడు అని టాక్. ఈ సినిమా ఎప్పుడు వస్తుంది అనేది ఇంకా స్పష్టంగా చెప్పలేని పరిస్థితి ఉంది. వచ్చే ఏడాది మొదలయ్యే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: