మన తెలుగులో కొందరు స్టార్ హీరోల సినిమాల విషయానికి వస్తే సినిమాను విడుదల అయ్యే వరకు కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుని విడుదల చేస్తూ ఉంటారు. ప్రతీ చిన్న విషయం కూడా ఇప్పుడు వాళ్ళు జాగ్రత్తలు తీసుకుని ప్రేక్షకుల ముందుకి తీసుకుని వచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ఇక మన తెలుగులో ఇప్పుడు తారక్ విషయానికి వస్తే బాబు ఒక సినిమాను విడుదల చేస్తుంటే దానికి అన్ని విధాలుగా న్యాయం చేసే విధంగా ఉంటే మాత్రమే సినిమాను విడుదల చేయడానికి ట్రై చేస్తాడు గాని లేకపోతే మాత్రం అసలు విడుదల చేసే అవకాశం అనేది ఉండదు అనే చెప్పాలి. 

 

ఇప్పుడు తారక్ హిందీ తమిళ్ రెండు భాషలు నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అదే విధంగా అతను కన్నడం కూడా నేర్చుకునే అవకాశం ఉంది అనే ప్రచారం టాలీవుడ్ వర్గాల్లో జరుగుతుంది. కన్నడం ని యష్ ని అడిగి నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు అని అలాగే శివ రాజ్ కుమార్ తో కలిసి నేర్చుకోవాలి అని చూస్తున్నాడు అని అంటున్నారు. మరి ఎంత వరకు నిజం అనేది చూడాలి. ఆర్ఆర్ఆర్ సినిమాలో డబ్బింగ్ కోసం గానూ అతను మూడు భాషల్లో కూడా ఒకేసారి డబ్బింగ్ చెప్పే ఆలోచనలో ఉన్నాడు అని అందుకే నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు అని సమాచారం. 

 

ఇప్పుడు అతను బెంగళూరు కూడా వెళ్ళే అవకాశం ఉంది అని సమాచారం. విజయ్ సేతుపతి కి అతనికి మంచి సంబంధాలు ఉన్నాయి. అతని ద్వారా ఈ విధంగా తమిళం నేర్చుకునే ఆలోచనలో ఉన్నాడు అని టాక్ వినపడుతుంది. మరి ఎం జరుగుతుంది అనేది చూడాలి.  కాగా ఇప్పుడు ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ తో ఒక సినిమా చేసే అవకాశ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: